హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ. ఎన్టీఆర్ 'కుటుంబ' దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
రాష్ట్ర ఎన్నికల రాజకీయాలు దురదృష్టకరమైన మలువులు తీసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ చరిత్ర రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశం కావడమే అందుకు ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దిగగానే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ చరిత్రపై దుమారం చెలరేగడం ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు, ఆయన రెండో భార్య షాలినికి పుట్టిన బిడ్డ జూనియర్ ఎన్టీఆర్. ఆయన కుటుంబ చరిత్రపై విమర్శలు రావడంతో ఇరకాటంలో పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాల్లోకి కుటుంబ విషయాలను తీసుకు వస్తే సహించబోమని తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు.

తాత స్వర్గీయ ఎన్టీ రామారావును తలపిస్తూ ఉత్తరాంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న పర్యటనలు విజయవంతం అవుతుండడంతో ప్రత్యర్థులు కుటుంబ విషయాలను తెచ్చి విమర్శలు చేయడం ప్రారంభించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ పట్ల, ఆయన తల్లి పట్ల వ్యవహరించిన తీరుపై ప్రత్యర్థులు ప్రధానంగా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై మంత్రి షబ్బీర్ అలీ జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే ముందు తల్లికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు సూచించారు. స్వర్గీయ ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా షబ్బీర్ అలీతో గొంతు కలిపారు. అవుట్ సైడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ను చిన్నచూపు చూశారని ఆయన అన్నారు.

తన తల్లికి తగిన వైవాహిక హోదా ఇవ్వాలని తండ్రి హరికృష్ణను అడగాలని షబ్బీర్ అలీ జూనియర్ ఎన్టీఆర్ కు సలహా ఇచ్చారు. తల్లికి న్యాయం చేయడానికి పోరాటం చేయాలని స్వర్గీయ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సూచించారు. ఎన్టీఆర్ కుటుంబం నీ తల్లిని తమ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించిందా అని ఆమె జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్, బాలయ్య కూతురు బ్రాహ్మణి వివాహానికి నిన్ను, నీ తల్లిని ఆహ్వానించారా అని ఆమె అడిగారు.

కాంగ్రెసు నాయకులే కాకుండా అదే విషయంపై చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ను స్వయంగా చిరంజీవి పిల్లకాకిగా అభివర్ణించారు. జూనియర్ ఎన్టీఆర్ చేత వేరెవరో పలికిస్తున్నారని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పిల్ల కాకి అయితే జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీలు పిల్ల గద్దలని తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు.

జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆటో రిక్షాలో తమ ఇంటికి వచ్చేవాడని, తిరిగి వెళ్లడంలో ఒక్కసారి చాలా ఆలస్యం జరిగిందని, దాంతో తన భార్య పురంధేశ్వరి కారులో జూనియర్ ఎన్టీఆర్ ను ఇంటికి పంపిందని, దాంతో తమ కుటుంబ సభ్యలు తగాదాకు దిగారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. అదే కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ ను తమ ప్రియపాత్రుడిగా ఎలా, ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను కూడా వాడుకుని చంద్రబాబు వదిలేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X