ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ అరెస్టు చెల్లదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అరెస్టు చట్టపరంగా చెల్లదని న్యాయవాదులు అంటున్నారు. కెసిఆర్ ను అరెస్టు చేసి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం చట్టబద్దం కాదని వాదిస్తున్నారు. లోకసభ సభ్యుడైన కెసిఆర్ స్థాయి నాయకుడ్ని అరెస్టు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో ఫస్టు క్లాస్ మెజిస్టేట్ కోర్టులు ఎన్నో ఉండగా పోలీసులు కెసిఆర్ ను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని వారంటున్నారు. లోకసభ సభ్యుడైన కెసిఆర్ అరెస్టుకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా వారు చెబుతున్నారు.

కెసిఆర్ పై పెట్టిన సెక్షన్లు కూడా కెసిఆర్ కు వర్తించవని న్యాయవాదుల అభిప్రాయం. కెసిఆర్ అరెస్టు విషయంలో, ఆయనపై మోపిన సెక్షన్లు చట్ట ఉల్లంఘన కిందికే వస్తాయని వారు చెబుతున్నారు. దీనికి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు విమర్శిస్తున్నారు. ఖమ్మం సబ్ జైలు కూడా రాజకీయ నాయకులను ఉంచేది కాదని, ఆ జైలుకు ఆ స్థాయి లేదని కూడా ఒక వాదన వినిపిస్తోంది.

రాజకీయ నాయకుడికి కల్పించాల్సిన సౌకర్యాలు ఖమ్మం సబ్ జైల్లో లేవని చెబుతున్నారు. అయితే ఖమ్మం సబ్ జైలులో వసతి సౌకర్యాలు ఇటీవలే పెంచామని, అందులో వసతుల కొరత ఏదీ లేదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటున్నారు. అవరమైతే మరిన్ని వసతులు కల్పిస్తామని ఆమె అంటున్నారు. ఈ స్థితిలో ఖమ్మం జైలు నుంచి కెసిఆర్ ను తరలించే అవకాశాలు కూడా లేవని ఆమె చెప్పారు. కెసిఆర్ మాత్రం తనను వరంగల్ కు గానీ హైదరాబాద్ కు గానీ తరలించాలని కోరుతున్నారు. మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ కెసిఆర్ కు మరో జైలుకు తరలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని అమలు పరచడానికి పోలీసు అధికారులు లేరు. అదే విధంగా ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి కూడా సిద్ధంగా లేరు. శాంతిభద్రతల పేరు చెప్పి ఆయనను ఖమ్మం జైలులోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తనను వేరే జైలుకు తరలించాలని కెసిఆర్ చేసిన వినతికి ఖమ్మం జిల్లా ఎస్పీ నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X