వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షిగా బాలకృష్ణ సతీమణి వసుంధర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna-Vasundhara
ప్రముఖ సినీ హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పేరును సిబిఐ అధికారులు ఎమ్మార్ కుంభకోణం కేసులో 108వ సాక్షిగా చేర్చారు. బాలకృష్ణ మొదటి కుమార్తె బ్రాహ్మిణి పేరుతో ఎమ్మార్‌లో ఓ విల్లా ఉంది. ఈ విషయమై సిబిఐ అధికారులు గతంలోనే బాలకృష్ణ ఇంటికి వెళ్లి దీనిపై విచారణ జరిపారు. వారి వాంగ్మూలాన్ని సిబిఐ తీసుకుంది. వసుంధర పేరును ఈ కేసులో సాక్షిగా పేర్కొంది. బ్రాహ్మిణి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కుమార్ భార్య. దీంతో విపక్షాలు బాబును టార్గెట్ చేసుకున్నాయి. అయితే ఆ విల్లా తాము కొనివ్వలేదని బాబు వివరణ ఇచ్చుకున్నారు.

ఎమ్మార్ కుంభకోణం కేసులో పలువురు ప్రముఖులు సాక్ష్యులుగా ఉన్నారు. నాటి పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సిబిఐ అధికారులు 17వ సాక్షిగా చేర్చారు. గతంలో సిబిఐ ఆయన ఇంటికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, తన వద్దకు వచ్చిన ఫైళ్లను రొటీన్ పద్దతిలోనే ప్రాసెస్ చేసి పంపించానని బొత్స సిబిఐ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును 27వ సాక్షిగా, ఎపిఐఐసి ఎండి మీనాను 16వ సాక్షిగా చేర్చారు. కోర్టుకు సమర్పించిన తన ఛార్జీషీట్‌లో సిబిఐ 286 మందిని సాక్షులుగా విచారించినట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

English summary
CBI named Hero Balakrishna's wife Vasundhara as witness in EMAAR scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X