చిన్నంకు జగన్ పార్టీ షాక్, కాంగ్రెసులోకా...

ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన చిన్నం రామకోటయ్య తెలుగుదేశం పార్టీలో చేరి శానససభ్యుడిగా గెలిచారు. అయితే, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయట పడక తప్పని పరిస్థితి వచ్చేసింది. బేషరతుగా వైయస్సార్ కాంగ్రెసు చేరడానికి ఆయన వెనకంజ వేస్తున్నారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ నేతలు కొందరు చిన్నంను వారి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఉత్సాహంతో తిరుపతిలో ఏఐసీసీ పెద్దలను కూడా కలసి వచ్చారు. ఈ విధంగా జగన్ పార్టీతో కరచాలనం చేస్తూనే ఎమ్మెల్యే చిన్నం ఒక కాలు కాంగ్రెస్‌లో పెట్టారు. మూడు పార్టీల మధ్య ఆయన దాగుడుమూతల ఆటలు ఆడుతున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే సీటు ఇచ్చిన, ఇవ్వకపోయినా వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్ళడమే మంచిదని సన్నిహితులు ఆయకు సలహా ఇస్తున్నారని చెబుతున్నాైరు. చిన్నం నుంచి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇటువంటి సంకేతాలు వెళుతున్నాయని, త్వరలోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కూడా నూజివీడులో ప్రత్యామ్నాయం వెదుక్కునే పనిలో ఉంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాలకు కూడా చిన్నం రామకోటయ్య వెళ్ళలేదు. తెలుగుదేశం సమావేశాల్లో తాను పాల్గొనబోనని కూడా ఆయన ప్రకటించారు. వైయయస్సార్ కాంగ్రెసు ఆకర్ష్ జాబితాలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ విప్ కాగిత వెంకట్రావు పేరు కూడా ఉన్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications