బాబుతో తమ్ముళ్ల ఆట!: పాదయాత్రలో ట్విస్ట్

ఇప్పటి వరకు చంద్రబాబు రెండువేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా నడిచారు. అయితే అందులో వందల కిలోమీటర్లు తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో అనవసరంగా నడిపించిందేనట. వారు తమ అత్యుత్సాహంతో బాబును ఇబ్బందులకు గురి చేశారంటున్నారు. దీంతో ఆ పాదయాత్ర వృథా అయిందంటున్నారు. నేతలు తమ తమ సొంత నియోజకవర్గాల్లో అధినేతను తిప్పేందుకు ఆసక్తి చూపి కొంత మేర వృథా చేశారట.
అనంతపురం జిల్లా నుండి ప్రారంభమైన పాదయాత్ర అదే జిల్లా నుండే నిష్ఫలమైందట. అనంతలో పాదయాత్ర చేసినప్పుడు బాబు కర్నాటకలో పదకొండు కిలోమీటర్ల మేర యాత్ర చేశారు. తెలుగు వాళ్లు లేనిచోట, తెలుగు ఓటర్లు లేనిచోట ఆయనను తిప్పారట. అంతేకాకుండా నిర్మానుష్య ప్రాంతాల్లోనే కాకుండా కొండలు, గుట్టల్లో ప్రమాదకర మార్గాల గుండా తిప్పారట. తమ తమ మెహర్బానీ కోసం నేతలు బాబును తప్పుదారి పట్టిస్తున్నారంటున్నారు.
చీకట్లో అటవీ ప్రాంతాల్లో తిప్పారు. ఓ నేత అయితే తన మొక్కు కోసం చంద్రబాబును ఓ గుడిలో నిద్రింప చేశారు. ఖమ్మంలో టౌన్ చుట్టు నాలుగు రోజులు తిప్పారట. ఆయా జిల్లాల్లో నేతలు సమన్వయంగా పని చేయకుండా తమ తమ సొంత నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ తిప్పిన చోటే, ప్రజలు ఎక్కువగా లేని గ్రామాల్లో తిప్పి బాబుతో ఆడుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ వైపు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు 'లీడర్'గా ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు తమ్ముళ్లు మాత్రం సొంత ఇమేజ్ కోసం బాబును ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్నారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications