వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణు బాంబు పేల్చినా.. ప్రిన్స్ చార్లెస్‌పై చర్యలుండవ్‌!

|
Google Oneindia TeluguNews

లండన్‌: అణు బాంబులు పేల్చే అధికారం బ్రిటిష్‌ రాకుమారుడు చార్లెస్‌కు ఉందనే విషయం తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌ రాజ సంతానం చట్టపరమైన హక్కులపై.. ప్లైమౌత్‌ వర్సిటీ పరిశోధకుడు జాన్‌ కిర్క్‌హోప్‌ చేపట్టిన పరిశోధనలో ఈ ఆసక్తికర అంశం వెలుగుచూసింది.

బ్రిటన్‌ రాజ్యాంగం, ప్రభుత్వ పురావస్తు దస్త్రాలు తదితర పత్రాలను విశ్లేషించిన అనంతరం.. చార్లెస్‌ ప్రత్యేక అధికారాలపై జాన్‌ ఓ నివేదిక తయారు చేశారు.

Prince Charles Allowed To Legally Launch Nuclear Weapons

బ్రిటన్‌ సమాచార భద్రతా చట్టం సహా పలు చట్టాల నుంచి చార్లెస్‌కు మినహాయింపు ఉన్నట్లు దానిలో జాన్‌ తెలిపారు. మిగిలినవారితో పోలిస్తే ఆస్తుల విషయంలో ఆయన పటిష్ఠ భద్రత అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘అణు సంబంధిత పేలుళ్లకు బ్రిటన్‌ రాజ సంతానం కూడా కారణం కావొచ్చు. ఈ విషయంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలుపడదు. దీనితోపాటు పలు చట్టాల నుంచి బ్రిటన్‌ రాకుమారుడికి మినహాయింపులు ఉన్నాయి'అని జాన్‌ వివరించారు. కాగా, బ్రిటన్ పార్లమెంటు 1913లో ఈ అధికారాలను వారికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

English summary
A new academic study conducted by Plymouth University has revealed that Prince Charles can legally set off nuclear explosions and be immune from prosecution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X