గేమ్ ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తోంది: ఇదీ పోకేమాన్ గో

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: స్మార్ట్ ఫోన్లలో లీనమై పరిసరాలను మరిచిపోవడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఫేస్‌బుక్, చాటింగ్, గేమ్‌లు ఆడుతూ ఫోన్లతో నేటి యువత బిజీగా గడుపుతోంది. అయితే, ఇటీవల వచ్చిన పోకేమాన్ గో మరింత చర్చనీయాంశంగా మారింది.

'పోకేమాన్ గో' రియాలిటీ ఆటలో నిమగ్నమైన ఇద్దరు కెనడా యువకులు అలా నడుచూకుంటూ ఏకంగా అమెరికా - కెనడా సరిహద్దు దాటారు. అమెరికా సరిహద్దు గస్తీ దళం సిబ్బంది పట్టుకొని ప్రశ్నిస్తే గానీ ఎక్కడ వరకు వచ్చారో వారికే తెలియలేదు.

సరిహద్దు దాటిన విషయం తెలియక వారు వచ్చేశారని ధ్రువీకరించుకున్న అనంతరం వారిని వదిలేశారు. అధికారుల సహకారంతో తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, పోకేమాన్ గో గేమ్.. లొకేషన్ ఆధారంగా ఆడే ఆట. ఈ ఈ ఆగ్ మెంటెడ్ రియాల్టీ గేమ్.. ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై ప్రపంచానికి పిచ్చెక్కిస్తోంది.

Canadian Teens Cause an International Incident Playing Pokémon Go

ఈ గేమ్ తయారీ సంస్థ నియాంటిక్. ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై జనాన్ని కట్టిపడేస్తోంది. ఈ గేమ్‌లో పడి కొందరు బాహ్య ప్రపంచాన్నే మరచిపోయి ప్రమాదాలను సైతం కొని తెచ్చుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఓ వ్యక్తి పోకేమాన్‌లను వెతికే పనిలో పడి, న్యూయార్క్‌లో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యాడు. మరో వ్యక్తి పార్కులో ఆడుతూ పరధ్యానంగా పూల్‌లో పడ్డాడు. రియాల్టీ గేమ్ ప్రపంచంలోకి ఆటగాళ్ళను తీసుకెళ్ళి వారికి కొత్త అనుభూతినివ్వడంతోపాటు, ఈ గేమ్ ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతోందంటున్నారు.

పోకెమాన్ గేమ్ యాప్‌ను స్మార్ట్ ఫోనుల్లో డౌన్ లోడ్ చేసుకుని, పోకెమాన్‌లను వెతికి పట్టుకోవడం కోసం వీధుల వెంట, పార్కుల వెంట తిరుగుతున్నారు. వాటిని వెతుక్కుంటూ మైళ్ళకొద్దీ దూరాలు ప్రయాణించేస్తున్నారు.

పోకేమాన్ గో ఇలా..

స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా ఆడే ఈ ఆట.. ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వగానే దగ్గరలోని పోకెమాన్‌లను చూపిస్తుంటుంది. ఇలా కనిపించిన పోకేమాన్‌లు ఉన్న ప్రాంతానికి జీపీఎస్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్ళి, పోకేబాల్‌తో కొడితే అక్కడున్న పోకేమాన్‌లు వారి సొంతమవుతాయి.

ఇలా పలు దశల్లో ఈ ఆట ఆడే అవకాశం ఉంటుంది. అమెరికాలో విడుదలైన రెండు వారాల్లోనే పోకేమాన్ గో అద్భుత విజయం సాధించింది. 30 మిలియన్ల డౌన్ లోడ్లతో, 35 మిలియన్ డాలర్లు సంపాదించేసి, ఏకంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ట్విట్టర్, ఫేస్‌బుక్ వినియోగదారులను దాటింది.

అయితే పోకేమాన్ స్వస్థలమైన జపాన్‌లో ప్రారంభం కాకముందే ఈ వినూత్న గేమ్ ప్రపంచంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఇప్పటికే 30 దేశాల్లో పైగా అందుబాటులో ఉన్న పోకేమాన్ గో గతవారం యూరప్ మార్కెట్లలో స్థిరంగా ఉండటంపై సంస్థ ఆనందం వ్యక్తం చేస్తోంది. త్వరలో భారత్ రానుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Canadian Teens Cause an International Incident Playing Pokémon Go.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి