వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

69 రోజుల్లో 10 లక్షల కండోమ్‌లు: ఆ 2 రాష్ట్రాల్లో డిమాండెక్కువ

ఆన్‌లైన్‌లో ఉచితంగా కండోమ్‌ స్టోర్ ప్రారంభించాక విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఉచితంగా కండ్‌మ్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండో‌మ్‌లు ఉచితంగా పంపిణీ చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఆన్‌లైన్‌లో ఉచితంగా కండోమ్‌ స్టోర్ ప్రారంభించాక విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఉచితంగా కండ్‌మ్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండో‌మ్‌లు ఉచితంగా పంపిణీ చేశారు.

Recommended Video

Bizarre Incident : పురుషాంగానికున్న కండోమ్ తీసి మింగేసిన యువతి ! అసలేం జరిగిందంటే ?

ఎయిడ్స్ వ్యాధి కారణంగా విచ్చలవిడి శృంగారానికి కండో‌మ్‌లను వాడాలని స్వచ్ఛంధ సంస్థలు ప్రచారం నిర్వహిస్తున్నాయి అయితే అదే సమయంలో ప్రభుత్వాలు కూడ ఈ విషయమై ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే సురక్షిత శృంగారంపై కొంత శ్రద్ద పెరిగిందనే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అయితే అదే సమయంలో మెడికల్ షాపుల్లోకి వెళ్ళి కండోమ్‌లు కొనుగోలు చేసే దాని కంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువగా ఉందని తాజా ఘటన నిరూపించింది. అంతేకాదు కండోమ్‌లను ఆన్‌లైన్‌లో ఉచితంగా సరఫరా చేయడం కూడ ఇందుకు మరో కారణంగా నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

ఉచిత కండోమ్‌ల పంపిణీకి 10 లక్షల డిమాండ్

ఉచిత కండోమ్‌ల పంపిణీకి 10 లక్షల డిమాండ్

ఆన్‌లైన్‌లో ఉచితంగా కండోమ్‌ల పంపిణీ కోసం ఎయిడ్స్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్‌లైన్‌లో ఫ్రీ కండోమ్‌ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌ ఇప్పటివరకు సుమారు. 9.56 లక్షల కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ సంస్థ ప్రారంభించిన 69 రోజుల్లోనే సుమారు 10 లక్షల ఉచిత కండోమ్‌లను పంపిణీ చేయడం సాధారణ విషయం కాదంటున్నారు నిర్వాహకులు.

కండోమ్‌ల కోసం 4.41 లక్షల ఆర్డర్లు

కండోమ్‌ల కోసం 4.41 లక్షల ఆర్డర్లు

తమకు కండోమ్‌లు కావాలని వ్యక్తిగతంగా సుమారు 4.41 లక్షల మంది ఆ సంస్థకు ఆర్డర్లు చేశారని ఎయిడ్స్ హెల్త్‌కేర్ పౌండేషన్ ప్రకటించింది.అయితే ఎన్‌జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేసింది.

ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక డిమాండ్

ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక డిమాండ్

ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్‌ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్‌ లేటెక్స్‌ లిమిటెడ్‌ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్‌ హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ ఇండియా డైరెక్టన్‌ డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు.అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎందుకు కండోమ్‌లకు డిమాండ్ ఉందనే విషయమై తేలాల్సి ఉంది.

20 లక్షల కండోమ్‌లకు ఆర్డర్లు

20 లక్షల కండోమ్‌లకు ఆర్డర్లు


డిసెంబర్‌ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్‌ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్‌ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని నిర్వాహకులు చెప్పారు. తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్‌ ఇచ్చినట్లు శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

English summary
Anonymity helps. In a country where social stigma has kept condom use to just 5 per cent of the contraceptive market, Indians ordered 10 lakh in just 69 days since the opening of Free Condom Store.Data from the online store, which was launched on April 28 by the AIDS Healthcare Foundation, shows that of the 9.56 lakh condoms they delivered free, 5.14 lakh were requested by communities and NGOs, while the remaining (4.41 lakh) were ordered by individuals. Demand from individuals was seen most in Delhi and Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X