వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ-నేను: ఫిరాయింపులపై బాబు, ప్రపంచం జగన్ గురించి అడిగితే ఏం చెప్పాలి?

వైసిపి అధినేత వైయస్ జగన్ ఫిరాయింపులపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: వైసిపి అధినేత వైయస్ జగన్ ఫిరాయింపులపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని శీఘ్రగతిన అభివృద్ది చేయాలనుకునే ప్రతీ వ్యక్తి మమ్మల్ని బలపరచాలని కోరానని చంద్రబాబు అన్నారు.

అక్కడ మోడీ, ఇక్కడ నేను..

అక్కడ మోడీ, ఇక్కడ నేను..

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద నమ్మకంతో చాలామంది పార్టీలోకి వస్తున్నారని, ఇక్కడ తన మీద నమ్మకంతో చాలా పార్టీల నుంచి టిడిపిలోకి వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ దూరాలనుకుంటున్నారు..

జగన్ దూరాలనుకుంటున్నారు..

రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు తగినట్టుగానే కేంద్రం ప్యాకేజీ ఇస్తామని చెప్పిందని, ఇందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం నుంచి సహకారం తీసుకోవద్దని జగన్ కోరుకుంటున్నారని, మోడీతో నేను విభేదించే రోజు వస్తే జగన్‌ ఎన్డీయేలో దూరి తన కేసులను మాఫీ చేసుకోవచ్చనేలా ఆలోచిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఇవి రాష్ట్ర ప్రయోజనాలా అని ప్రశ్నించారు.

ప్రపంచంలో నేను ఎక్కడికెళ్లినా మీ ప్రతిపక్షం ఎవరని అడిగితే ఏమని చెప్పాలన్నారు. తమ ప్రతిపక్షనేత ఒక ఆర్థిక నేరస్తుడని, ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నడుస్తున్నాయని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడని చెప్పమంటారా? అన్నారు.

మంత్రి పదవులపై..

మంత్రి పదవులపై..

మంత్రి పదవులు దక్కనివారంతా రోడ్డెక్కితే క్రమశిక్షణ రాహిత్యం అవుతుందని చంద్రబాబు అన్నారు. తాను ఎంత చనువుగా ఉంటానో.. అవసరమైతే అంతే కఠినంగా ఉంటానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిమితిలోనే మంత్రిమండలిని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఎస్సీలు, ముస్లింలకు ఎలాంటి అవకాశాలివ్వాలన్న దానిపై పరిశీలిస్తున్నానని, జిల్లాలు, ప్రాంతాల్ని కూడా సమతూకంగా చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలనేవి వ్యవస్థీకృత విభాగం (ఆర్గనైజింగ్‌ సెక్టార్‌) పరిధిలోనివి అని చెప్పారు. ఇక్కడ తమ పార్టీ గెలవలేదన్నారు.

సామాన్య జనం (మాస్‌)లో తమకు మంచి పేరు ఉందని చెప్పారు. ఇక ముందు అలా జరగకుండా ఇప్పటి నుంచే భవిష్యత్తు ఎన్నికలపై ప్రణాళికలు వేసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ ఒకేసారి రావాలనేది తన అభిమతమని, ప్రస్తుతం దీని మీద చర్చలు నడుస్తున్నాయని చెప్పారు.

రైల్వే జోన్ వస్తుంది

రైల్వే జోన్ వస్తుంది

విశాఖ నుంచి రాయపూర్‌ వరకు ప్రత్యేక రహదారిని ప్రతిపాదించామని, లాజిస్టిక్‌ పరంగా విశాఖను మేజర్‌హబ్‌గా మారుస్తామని, విశాఖకు రైల్వే జోన్‌ కచ్చితంగా వస్తుందని, రాష్ట్ర విభజనచట్టాన్ని సవరించి నియోజకవర్గాల పునర్విభజనను కూడా సాధిస్తామని చంద్రబాబు అన్నారు.

English summary
AP CM Nara Chandrababu Naidu make interesting comments on defections and YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X