ఒంటరిగానే సెల్ లో శశికళ, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న అన్నాడిఎంకె నేత శశికళ ఇప్పుడు ప్రత్యేక సెల్ లోకి మారింది.ఆమె ఒంటరిగానే ఉండాలని యోచిస్తున్నట్టు జైలు వర్గాలు చెబుతున్నాయి.

ఇదే కేసులో జైలులోని 2వ, సెల్ లో తన వదిన ఇళవరసితో కలిసి ఉంటున్న శశికళ ప్రస్తుతం 4వ, నెంబర్ సెల్ లోకి మారినట్టు జైలు వర్గాల ద్వారా తెలిసింది.

పరప్పర అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తోంది. ఇటీవల కాలంలో ఆమెను చాలమందిని జైలులో కలుసుకొన్నారు.

In jail, Sasikala prefers to be left alone

ఆమె జైలు కారిడార్ లో నడుస్తూ పలువురిని కలిసేందుకు వెళ్తున్న సమయంలోనే ఇతర ఖైదీలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. రక్షణపరమైన సమస్యలు వస్తాయని చెప్పారు.

ఇక నుండి వీలైనంతవరకు తక్కువమందిని కలవాలని ఆమె నిర్ణయించుకోవడం తదితర కారణాలతో ఆమె ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకొని ప్రత్యేక సెల్ లోకి వెళ్ళారట,. కారిడార్ లో కూడ మునుపటిలాగానే ఆమె కన్పించడం లేదంట.

ఇటీవలె ఆమెకు ఒక పెద్ద దోమతెర కూడ ఇచ్చారని సమాచారం. అందులోనే కూర్చొని ఆమె భోజనం చేస్తూ తమిళ వార్తా చానళ్ళ కంటే సినిమాలే ఎక్కువగా చూస్తున్నట్టు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో తమిళ పేపర్లు మాత్రం చదువుతున్నారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK leader V K Sasikala moved out of the cell she was sharing with fellow convict J Ilavarasi and is now housed in a separate cell at Central Prison, Parappana Agrahara, a source said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి