కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం జరిగింది. సీనియర్ మంత్రి అయినప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసే అవకాశం లేకుండా పోయింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఏ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా లేరు.

జగన్ వ్యాఖ్యలు, చంద్రబాబు భావోద్వేగం

KE Krishna Murthy is not in flag hausting ministers list

దీంతో అధికారికంగా జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేసే అవకాశం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా కేఈ కృష్ణమూర్తి సొంత జిల్లా కర్నూలులో మంత్రి కాల్వ శ్రీనివాసులు జెండా ఎగురవేస్తారు.

List Came Out : Chandra Babu Naidu Changed AP Cabinet Ministers - Oneindia Telugu

మంత్రివర్గంలో సీనియర్ అయినప్పటికీ, ఆయనను ఏ జిల్లాకు ఇంచార్జిగా నియమించకపోవడం గమనార్హం. గతంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అధికారాలను సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేయడం తెలిసిందే. రెవెన్యూ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and Deputy Chief Minister KE Krishna Murthy is not in flag hausting ministers list.
Please Wait while comments are loading...