వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్ష: కర్ణాటకలో బిజెపి ట్రంప్ కార్డు రజనీకాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రాజకీయాల్లోకి రావడం ఖాయమని చెప్పిన భాషాను బిజెపి కర్ణాటక ఎన్నికల్లో ట్రంప్ కార్డుగా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉందని అంటున్నారు. రజినీకాంత్ విధానాలు తమ పార్టీ సిద్దాంతానికి అనుగుణంగా ఉన్నాయని, ఆయన తమతో కలిసి నడుస్తారని బిజెపి నమ్ముతోంది.

తమిళనాడు ఎన్నికల కన్నా ముందే రజనీకాంత్ తన రాజకీయాల సత్తాను కర్ణాటకలో పరీక్షించుకుంటారని అంటున్నారు. కర్ణాటకలో ఆయనను ఉపయోగించుకునేందుకు అప్పుడే బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది.

రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు

రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు

తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ సంకేతాలు ఇచ్చినప్పటి నుంచే బిజెపి ఆయనకు దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆధ్యాత్మిక రాజకీయాలను నడిపిస్తానని రజనీకాంత్ చెప్పడంతో ఆయన సిద్ధాంతాలు తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయని బిజెపి అనుకుంటోంది.

మాకేం అంటరాని వారు కారంటున్న బిజెపి

మాకేం అంటరాని వారు కారంటున్న బిజెపి

రజనీకాంత్‌తో కలిసి నడవడానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని, ఆయన చెబుతున్న విషయాలను తాము సమర్ధిస్తున్నామని, ఉత్తమ నడవడి ఉన్నవారెవరు కూడా తమకు అంటరాని వారు కారని బిజెపి నాయకులు అంటున్నారు. అయితే, రజనీని కర్ణాటక ఎన్నికల్లో వాడుకునే విషయంపై మాత్రం మాట్లాడడం లేదు.

తమిళనాడులో ఇలా...

తమిళనాడులో ఇలా...

తమిళనాడు నాస్తికవాద రాజకీయాలకు తాము స్వస్తి చెప్పాలని భావిస్తున్నామని, మత విలుపలతో కూడిన రాజకీయాలను తేవాలనేది తమ ప్రయత్నమని, తమ ప్రయత్నాలకు రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం సాయం చేస్తుందని తమిళనాడు బిజెపి నేతలు అంటున్నారు.

రజనీ కర్ణాటక మూలాలు...

రజనీ కర్ణాటక మూలాలు...

తమిళనాడు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే ఏడాది మేలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. రజనీకాంత్ మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. దీంతో రజనీకాంత్‌ను కర్ణాటకలో వాడుకోవాలని బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కర్ణాటకలో రజనీకాంత్ ప్రచారం గురించి ఇప్పుడు మాట్లాడడం తొందరపాటే అవుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. మకర సంక్రాంతికి రజనీకాంత్ తన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

English summary
BJP leaders wooing Tamil Super star Rajinikanth to campaign for them in the upcoming Karnataka elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X