ఈ నేతల చూపు.. జనసేన వైపు? నాయకుల ఆరాటం.. చేరికకు సరైన సమయం!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా చేరికలు ప్రారంభం కాబోతున్నాయి. త్వరలోనే కొంతమంది ఇతర పార్టీల నాయకులు జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఉన్న ఒకే ఒక్కడు, ప్రముఖ నాయకుడు.. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన పవన్ కళ్యాణ్ మాత్రమే. ఏ పార్టీకైనా నాయకులే బలం. అందులోనూ ప్రముఖులైన నాయకులు ఎంతమంది ఉంటే అంత బలం. ఈ విషయాన్ని జనసేన కూడా గ్రహించినట్లు ఉంది.

బలోపేతం దిశగా జనసేన...

బలోపేతం దిశగా జనసేన...


సాధారణ ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది మే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కూడా పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యల వైపు అడుగేస్తున్నట్లు సమాచారం.

పవన్ టార్గెట్ రివర్స్ అయిందా ?
నేతల చేరిక కూడా...

నేతల చేరిక కూడా...

ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఆన్ లైన్ లో.. ఫోన్ కాల్స్ ద్వారా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు కొంతమంది రాజకీయ నేతలు కూడా జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా రాజకీయ పార్టీ అంటూ మొదలయ్యాక.. ఇతర పార్టీల నుంచి నాయకులు ఆ పార్టీకి రావడం సహజమే. అయితే జనసేన విషయంలో ఇది కాస్త ఆలస్యమైందనే చెప్పాలి.

ఆ ఇద్దరి చూపు.. ఇటువైపే...

ఆ ఇద్దరి చూపు.. ఇటువైపే...


తాజాగా జనసేన పార్టీలో చేరబోతున్న ఇతర పార్టీలకు చెందిన నాయకుల్లో.. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కాంగ్రెస్ హయాంలో ఎంపీలుగా పనిచేసిన వారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడ్డాక ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ ప్రాభవం కోల్పోయారు. అయితే చింతామోహన్, హర్షకుమార్ మాత్రం అడపాదడపా రాజకీయ ప్రకటనలతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు.

కాంగ్రెస్ బతికి బట్టకట్టదనేనా?

కాంగ్రెస్ బతికి బట్టకట్టదనేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే అవకాశం కనుచూపుమేరలో కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున మళ్లీ పోటీ చేసినా ఫలితం దక్కదనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో వీళ్లిద్దరి చూపు జనసేనపై పడిందని, వీరు ఆ పార్టీలో చేరే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే చింతామోహన్ కొన్నాళ్లుగా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో వీరిద్దరి చేరిక ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Pawan Kalyan's political party Janasena already started it's subscription process in view of the target of 2019 elections. Soon some prominent leaders also going to join in Janasena, according to the sources. Congress Leaders, Former MPs from Tirupati and Amalapuram.. Chinta Mohan and Harsha Kumar want to join in Janasena. The Day & Time to be announced, That's it.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి