బీరకాయ పెరుగు పచ్చడి.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా!
వేసవికాలంలో తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేసవికాలంలో రుచితో పాటు, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఆహారాలను తినాలి. వేసవిలో ప్రత్యేకంగా చల్లదనాన్ని చేకూర్చే ఆహారాలలో బీరకాయ పెరుగు పచ్చడి ఒకటి. ఈ బీరకాయ పెరుగు పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి? దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బీరకాయ – పావు కిలో
పచ్చిమిరపకాయలు- 8 కారాన్ని బట్టి
పెరుగు – 1 కప్పు
జీలకర్ర- ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు- 6
ఉప్పు- తగినంత
చింతపండు- ఉసిరికాయంత
నూనె- ఒక టేబుల్ స్పూన్
తాలింపు కోసం:
ఆవాలు- అర టీ స్పూన్
జీలకర్ర- అర టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 1
కరివేపాకు – కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి పై పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొడిమలు తీసిన పచ్చిమిరపకాయలు. బీరకాయ ముక్కలు, కొంచెం చింతపండు ఒక పాన్ లో స్టవ్ పైన పెట్టి కొద్దిగా నూనె వేసి వేయించాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి.
బీరకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే టేస్టీ
బాగా మెత్తని పేస్ట్ లా కాకుండా కాస్త రఫ్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమంలో ఒక కప్పు పెరుగును కలిపి, మళ్లీ స్టవ్ పైన పాన్ పెట్టి, పాన్ లో నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, ఈ తాలింపును పచ్చడిలో పోయాలి. అంతే రుచికరమైన బీరకాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది.
బీరకాయ పెరుగు పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు
దీనిని వేడి అన్నంతో కానీ, రోటీలతో కానీ తింటే చాలా బాగుంటుంది. వేసవి కాలంలో దీనిని తింటే కాస్త శరీరం చల్లబడుతుంది.దీనిని తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గటానికి కూడా దోహదం చేస్తుంది. ఇది చర్మానికి చాలా మంచిది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
-
ఆ స్టార్ హీరో ఫేవరెట్ "బంగాళ దుంప - దోసకాయ" కర్రీ ఎలా చేయాలంటే..? -
eye health food: కంటి చూపును కాపాడే ఆహారాలు.. ఇప్పుడు ఇవి చాలా అవసరం! -
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications