చలికాలం ఇలా చికెన్ రసం ట్రై చెయ్యండి.. టేస్ట్ అదిరిపోద్ది!
మన ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఆహారం విషయంలో కచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి. తినే ఆహారంలో రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో చికెన్ ఒకటి.
చికెన్ రసంతో ఆరోగ్యం
మనం చికెన్ రక రకాలుగా వండుకుంటాం. ప్రస్తుతం మనం చికెన్ రసం ఏవిధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. చికెన్ రసం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో చికెన్ రసం తయారు చేసుకుని తినండి. ఒక్క మెతుకు కూడా అన్నం వదలకుండా తినేస్తారు అంటే నమ్మండి.

చికెన్ రసం తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్- ఎముకలతో ఉన్నది 250 గ్రాములు
నీరు -మూడు నుంచి నాలుగు కప్పులు
టమాటాలు -రెండు చిన్న ముక్కలుగా కట్ చేసినవి
చింతపండు- చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి- 6 నుండి 8 రెబ్బలు నూరినవి
అల్లం- ఒక అంగుళం నూరినది
పచ్చిమిర్చి- రెండు చీల్చినవి
కరివేపాకు- రెండు రెమ్మలు
కొత్తిమీర- కొద్దిగా
రసం పొడి- ఒకటిన్నర స్పూను
మిరియాల పొడి- ఒక స్పూను
పసుపు- పావు చెంచా
కారం- అర చెంచా
ఉప్పు-- తగినంత
నూన -రెండు చెంచాలు
ఆవాలు- అర చెంచా
జీలకర్ర- అర స్పూను
ఎండుమిర్చి- రెండు
తయారీ విధానం
స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె వేసి, చికెన్, పసుపు, నూరిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి చికెన్ లో పచ్చిదనం పోయేవరకు ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికేవరకు కలుపుకుంటూ అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రసం పొడి, మిరియాల పొడి, కారం వేసి వేసి టమాటాముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి.
రసం ఇలా చేస్తే బాగుంటుంది
ఆపై అందులో చింతపండు రసం కూడా పోసి, రసానికి సరిపడా నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు కారం, పులుపు అన్ని రుచి చూసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు రసాన్ని మరిగించుకోవాలి. వేరే స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడిన తర్వాత ఆ తాలింపును రసంలో కలుపుకోవాలి.
వేడి వేడి చికెన్ రసం ఇలా తినండి
చివరగా కొత్తిమీర కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి చికెన్ రసం తయారవుతుంది. ఈ చికెన్ రసం అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో జలుబు దగ్గు జ్వరం తదితర సమస్యలతో ఇబ్బంది పడే వారికి మంచి ఉపశమనం ఇస్తుంది. శరీర బలం పెంచి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications