ఈ 'ఉల్లి నూనె' తో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. ఎలా తయారు చేయాలి..?
మనిషి అందాన్ని నిర్వచించడంలో జుట్టు ప్రధానమైనది. జుట్టు ఒత్తుగా ఉన్నవాళ్లు సహజంగానే అందంగా కనిపిస్తారు. అయితే మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం, వాతావరణ మార్పులు.. ఒక్కటేమిటి ఇలా చాలా కారణాల వల్ల చిన్న వయసు నుంచే జుట్టు ఊడిపోవడం చూస్తుంటాం. పాతికేళ్లకే బట్టతల సమస్యతో బాధపడుతున్నవాళ్లు మనచుట్టూ ఎందరో ఉన్నారు. ఇక జుట్టను కాపాడుకోవడం కోసం రకరకాల షాంపోలను, ఇతర హెయిర్ ఆయిల్ ను వాడుతుంటారు. వాటితో కొత్త సమస్యలు వచ్చిపడుతుంటాయి.
అయితే ఇంట్లోనే సులభంగా ఉల్లి నూనెను తయారు చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఉల్లి నూనెతో జుట్టు ఒత్తుగా పెరుగుతుందని వివరిస్తున్నారు. మరి ఉల్లి నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు ఓ సారి చూస్తే.. ఉల్లిపాయలు 2, నువ్వుల నూనె ఒక కప్పు, అలాగే కొబ్బరి నూనె ఒక కప్పు.. అంతే కేవలం మూడు పదార్థాలతోనే ఎంచక్కా ఇంట్లోనే ఈ ఉల్లి నూనెను తయారీ చేసుకోవచ్చు.
ఉల్లి నూనె తయారీ విధానం చూస్తే.. ముందుగా పెద్ద ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి పేస్టు మాదిరి చేసుకోవాలి. కావాలంటే అందులో కొద్దిగా కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఉల్లిపాయల పేస్టు, మిగతా కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి. అలాగే పెద్ద మంటపైన పెట్టి ఒక పొంగు వచ్చాక.. సిమ్ లో పెట్టి 30 నిమిషాల పాటు మరిగించుకోవాలి.

ఈ క్రమంలో ఉల్లిపాయలోని ఔషధ గుణాలన్నీ నూనెలోకి చేరతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లబడే దాకా పక్కన పెట్టాలి. నూనె చల్లారాక ఒక శుభ్రమైన క్లాత్ తీసుకుని ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలోకి వడకట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అలా ఈ నూనెను మూడు నుంచి నాలుగు నెలలపాటు ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
-
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications