నయా స్టైల్ లో 'గార్లిక్ చికెన్ కర్రీ'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్..!
చికెన్ అంటే చాలామందికి నోరూరుతుంది. చికెన్ ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. చికెన్ తో ఎలాంటి రకాల వంటలు చేసినా టేస్టీగానే ఉంటుంది. మరి చికెన్ తో నోరూరించే నయా స్టైల్ 'గార్లిక్ చికెన్ కర్రీ' ఎప్పుడైనా తిన్నారా..? ఈ వంటను తయారు చేసుకోవడం కూడా సులువే.. మరి ఎలా చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం..
'గార్లిక్ చికెన్ కర్రీ' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ అరకిలో, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, కారం తగినంత, నూనె తగినంత, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర తురుము తీసుకోవాలి.
గార్లిక్ చికెన్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమానికి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్టును పట్టించి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేసి సన్నని మంటపై వేయించుకోవాలి.

ఇప్పుడు వేరే గిన్నె తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. అలాగే వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేయాలి. ఆ మిశ్రమంలోనే కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా మిక్సింగ్ అయ్యేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ గార్లిక్ చికెన్ కర్రీ రెడీ అయినట్టే..
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
పుచ్చకాయ రైస్ అసలు ఎప్పుడైనా ట్రై చేశారా..? -
eye health food: కంటి చూపును కాపాడే ఆహారాలు.. ఇప్పుడు ఇవి చాలా అవసరం! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications