ఆంధ్రమాత గోంగూర.. గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి తింటే వదిలిపెట్టరు!
ఆంధ్రమాత గోంగూర.. దీన్ని వివిధ రకాలైన వంటకాలలో వాడుతారు. ముఖ్యంగా గోంగూర పచ్చడి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ డిష్. గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి అంటే దాని రుచి గురించి తెలిసిన వాళ్ళందరూ పడి చస్తారు. మరి గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి ని ఏవిధంగా తయారు చేయాలి? ఎలా చేస్తే ఇది తినడానికి సూపర్ గా ఉంటుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
గోంగూర పచ్చడి కి కావలసిన పదార్థాలు
గోంగూర మూడు కట్టలు
పచ్చిమిరపకాయలు 25 కారాన్ని బట్టి
వెల్లి పాయలు- 10 రెబ్బలు
జీలకర్ర- రెండు స్పూన్లు
ధనియాలు- రెండు స్పూన్లు
చింతపండు- ఉసిరికాయంత
కరివేపాకు, కొత్తిమీర - రెండు రెమ్మలు
ఉప్పు- రెండు స్పూన్ల ఉప్పు రుచికి తగినంత
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు- రెండు
పోపు గింజలు- ఒక స్పూను
ఎండు మిరపకాయలు - రెండు

తయారీ విధానం
ముందుగా గోంగూరను తెంపుకొని శుభ్రంగా నీళ్లలో కడిగి, పచ్చిమిరపకాయలు కూడా తొడిమలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని, ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి ఈ గోంగూర పచ్చిమిరపకాయలను, ఉసిరికాయంత చింతపండు కూడా కలిపి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూర పచ్చిమిరపకాయలను చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చడిని నూరుకోవాలి.
గుంటూరు గోంగూర పచ్చడి ఇలా చెయ్యాలి
గోంగూర, పచ్చిమిరపకాయలు, చింతపండు, పది వెల్లిపాయ రెబ్బలు, రెండు స్పూన్ల జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, రెండు స్పూన్ల ఉప్పు, రుచికి తగినంత వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. లేదా రోట్లో నూరుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలను కూడా కలిపి ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ తిప్పి ఆఫ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు కచ్చాపచ్చాగానే ఉంటే రుచిగా ఉంటుంది.
వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసి, రెండు ఎండు మిరపకాయలు తుంచి అందులో వేసి, అందులో ఒక స్పూన్ ధనియాలు, కరివేపాకు కూడా వేసి పోపు చేయాలి. ఈ పోపును మనం నూరుకున్న పచ్చడిలో కలుపుకొని, కొద్దిగా కొత్తిమీర యాడ్ చెయ్యాలి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే వేరు.
అన్నం లోకే కాదు పలావ్ లోకి కూడా ఈ పచ్చడి అదుర్స్
ఇందులో కాస్త నెయ్యి జోడిస్తే రోజు తినే అన్నం కన్నా ఎక్కువ కచ్చితంగా లాగిస్తారు. ఇది అన్నం లోకే కాదు, పలావ్ లోకి కూడా చాలా సూపర్ గా ఉంటుంది. మరెందుకు కాలుష్యం గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి ని ఇలా చేసుకుని తినండి.
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications