health tips: ఏ వయసు వాళ్లైనా యంగ్ గా కనిపించాలంటే హెల్త్ మంత్ర ఇదే!!
వాకింగ్ చేయలేకపోతున్నారా? కనీసం ఎక్సర్సైజులు, యోగాలు చేయడానికి కూడా కుదరటం లేదా? అయితే ఇటువంటి వారు సైక్లింగ్ చేసినా మెరుగైన ఫలితాలు ఉంటాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు సైకిల్ తొక్కితే పదేళ్ల వయసు వెనక్కి పోతుందని స్వీడన్ కు చెందిన పలువురు సైంటిస్టులు తమ అధ్యయనంలో వెల్లడించారు.

వృద్ధాప్య ఛాయలను దూరం చేసే సైక్లింగ్
సైక్లింగ్.. శారీరక వ్యాయామాన్ని కలిగించే ఒక అద్భుతమైన సాధనం గా మనం చెప్పొచ్చు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శరీర బరువు తగ్గడం తో పాటుగా, గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు సైకిల్ తొక్కే వారు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందుతారని ఉత్సాహంగా ఉంటారని అనేక అధ్యయనాలు తేల్చాయి. వృద్ధాప్య ఛాయలను సైక్లింగ్ దూరం చేస్తుందని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సైక్లింగ్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు
ప్రతి రోజూ సైక్లింగ్ చేయడం వల్ల చర్మం కాంతివంతం అవడమే కాకుండా, యవ్వనంగా కనిపిస్తారు అని అధ్యయనంలో తేల్చారు. సైకిల్ తొక్కడం వల్ల చక్కని దేహదారుఢ్యం సొంతమవుతుందని, ప్రతిరోజూ వాకింగ్ చేయలేమని, ఎక్సర్సైజులు చేయలేమని బాధపడేవారు నిత్యం 30 నిమిషాల పాటు ఏకధాటిగా సైకిల్ తొక్కిన ఫలితముంటుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ వ్యాధుల నుండి సైక్లింగ్ తో రక్షణ
ఆర్థరైటిస్, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్స్ నుండి రక్షించడంలో సైక్లింగ్ కీలక భూమిక పోషిస్తుందని పలువురు వైద్యులు వెల్లడించారు. సైక్లింగ్ మంచి వ్యాయామమని, అన్ని వయసుల వారు సైక్లింగ్ చేయడం ఆరోగ్యకరమని, ప్రతి రోజూ కొంత సమయం సైక్లింగ్ చేయడం వల్ల శరీరం యాక్టివ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడానికి దుకాణాలకు వెళ్లేటప్పుడు, స్కూళ్లు, కళాశాలలకి వెళ్లేటప్పుడు సైకిల్ పై వెళ్లడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండడం ఖాయమని చెబుతున్నారు.

సైక్లింగ్ వల్ల ప్రయోజనాలు ఇవే
సైకిల్ కి ఇతర క్రీడల వలె శారీరక నైపుణ్యం అవసరం లేదని, బ్యాలెన్స్ గా సైకిల్ ను తొక్కగలిగితే చాలని అంటున్నారు. రోజు ఉదయం సమయంలో సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెబుతున్నారు. కాళ్లు ,కండరాలు బలంగా తయారు కావడానికి సైక్లింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన ను సైక్లింగ్ తగ్గిస్తుందని చెబుతున్నారు.

బరువు విషయంలో కూడా సైక్లింగ్ తో మేలు
మన బరువును నియంత్రణలో ఉంచడానికి, విపరీతంగా బరువు ఉన్నవారు తగ్గడానికి సైక్లింగ్ ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న సైక్లింగ్ చేయడం శరీరానికి, ఆరోగ్యానికి లబ్ధి చేకూరుతుందని తెలిసిన తర్వాత అయినా పక్కన పడేసిన సైకిళ్లను ప్రతిరోజు వాడటం మొదలు పెడతారని ఆశిద్దాం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications