Diabetes: డైట్ తో పని లేదు. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొంటే చాలు
మధుమేహం (Diabetes) అదుపు తప్పితే చాలు.. వెంటనే మన ఆలోచనలు మందులు, ఆహార నియంత్రణ, జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చుట్టూ తిరుగుతాయి. ఖచ్చితంగా ఇవి అవసరమే, కానీ వీటన్నింటికీ మించి మన ఇంట్లోని కిటికీ దగ్గర లభించే 'సహజ వెలుగు' కూడా షుగర్‌ను నియంత్రించగలదని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉందని తాజా పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.
మన శరీరంలోని ప్రతి కణానికి ఒక 'జీవ గడియారం' (Circadian Clock) ఉంటుంది. పగలు వెలుగును, రాత్రి చీకటిని గుర్తించి మన జీవక్రియలను క్రమబద్ధీకరించడం దీని ప్రధాన విధి. పగటిపూట మన శరీరం ఎంత సహజ కాంతికి గురైతే, ఈ గడియారం అంత కచ్చితంగా పనిచేస్తుంది. అయితే, ఆధునిక జీవనశైలిలో పగలు గదుల్లోనే గడపడం, రాత్రివేళ మొబైల్స్, ఎల్ఈడీ బల్బుల వంటి కృత్రిమ కాంతిలో ఉండటం వల్ల ఈ గడియారం గందరగోళానికి లోనవుతోంది. దీని ప్రభావం నేరుగా రక్తంలోని గ్లూకోజు స్థాయిలపై పడుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మాస్ట్రిచ్ట్ యూనివర్సిటీ వినూత్న ప్రయోగం
నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మధుమేహ రోగులపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. కొందరు రోగులను పెద్ద కిటికీలు ఉండి, సహజ వెలుగు ధారాళంగా వచ్చే గదుల్లో ఐదు రోజుల పాటు ఉంచారు. ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు వారు కేవలం సూర్యకాంతిలోనే గడిపారు. అనంతరం, వారినే కిటికీలు లేని, కేవలం కృత్రిమ వెలుగు ఉండే గదుల్లో ఉంచి పరిశీలించారు. రెండు సందర్భాల్లోనూ వారి ఆహారం, మందుల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
ఆశ్చర్యపరిచిన ఫలితాలు
ఈ అధ్యయనంలో వెల్లడైన ఫలితాలు వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేశాయి. సహజ కాంతిలో గడిపిన రోజుల్లో రోగుల గ్లూకోజు స్థాయిలు దాదాపు 50 శాతం మేర ఆరోగ్యకరమైన రీతిలో స్థిరంగా ఉన్నాయి. అదే కృత్రిమ కాంతిలో ఉన్నప్పుడు అది 43 శాతానికి పడిపోయింది. అంటే, కేవలం సహజ వెలుగు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఇన్సులిన్‌కు స్పందించే తీరు మెరుగుపడి, గ్లూకోజు త్వరగా శక్తిగా మారిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
చిన్న మార్పు.. పెద్ద లాభం
మధుమేహం వల్ల వచ్చే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యల ముప్పు ఉన్నవారికి ఈ 7 శాతం వ్యత్యాసం కూడా ఎంతో కీలకం. పగటిపూట కిటికీలు తెరిచి ఉంచడం, ఆఫీసుల్లో కిటికీ పక్కన కూర్చుని పనిచేయడం, రాత్రిపూట గంట ముందే డిజిటల్ స్క్రీన్లను పక్కన పెట్టడం వంటి చిన్న మార్పులు ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతాయని ఈ పరిశోధన నిరూపించింది.
-
చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు.. -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications