నెల్లూరు స్పెషల్ వంటకం.. మసాలా వడల పులుసు.. సూపర్ టేస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు ఆ జిల్లాకు ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. అలా నెల్లూరు జిల్లాలో స్పెషల్ వంటకాలు ఉంటాయి.నెల్లూరు స్టైల్ మసాలా వడలపులుసు చాలా స్పెషల్. ప్రత్యేక రుచుల్లో ఒకటైన మసాలా వడలపులుసు స్పైసీ, టాంగీ టేస్ట్‌తో ఫుడ్ లవర్స్‌కు ఫేవరెట్ వంటకం. బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండే మసాలా వడలను కారం పులుపు మిశ్రమంలో ముంచి తయారుచేసే ఈ వంటకం అన్నం, ఇడ్లీ, దోశతో సరిపోతుంది.
వడల కోసం:
శనగపప్పు – 1 కప్పు
ఉల్లిపాయ-- కట్ చేసిన ముక్కలు
పచ్చిమిర్చి- 4
కరివేపాకు- 2 రెమ్మలు
జీలకర్ర- ఒక స్పూన్
ఉప్పు- అర స్పూన్
నూనె – వేయించడానికి
పులుసు కోసం:
ఉల్లిపాయలు – 2
టమోటాలు – 2
చింతపండు రసం- ఉసిరికాయంత
కారం పొడి- 2 స్పూన్లు
పసుపు- అర స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూన్
పోపు గింజలు - ఒక స్పూన్

తయారీ విధానం
శనగపప్పును 3–4 గంటలు నానబెట్టి ముద్దలా రుబ్బాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి వడల పిండి తయారు చెయ్యాలి. పాన్‌లో నూనె వేసి మసాలా వడలను తయారు చెయ్యాలి. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి పోపు గింజలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలను వేసి బాగా మగ్గించాలి. అందులో చింతపండు రసాన్ని పోసి బాగా మరిగించాలి.
నెల్లూరు స్టైల్ మసాలా వడల పులుసు
పులుసులో అర స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మరిగాక అందులో చివరగా వేయించిన వడలను పులుసులో వేసి 5–10 నిమిషాలు మరిగించాలి. అంతే రుచికరమైన నెల్లూరు స్టైల్ మసాలా వడల పులుసు రెడీ అవుతుంది. వడలకు పులుసు పట్టాక తింటే ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేస్తే మీరే చెప్తారు సూపర్ టేస్టీ అని.ఇదితింటే క్రిస్పీగా, జ్యూసీగా, టేస్టీ గ చాలా బాగుంటుంది.
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications