తెలంగాణ స్టైల్ 'చికెన్ ఫ్రై'.. ఇలా చేస్తే ముక్క మిగుల్చకుండా తింటారు..!
చికెన్ అంటేనే చిన్నా పెద్దా అందరికీ నోరూరుతుంది. చికెన్ ను ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. అయితే చికెన్ తో ఇప్పటికే చాలా వెరైటీస్ ను టేస్ట్ చేసి ఉంటారు. అయితే తెలంగాణ స్టైల్ చికెన్ వేపుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ రెసిపీ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. మరి ఈ చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
తెలంగాణ స్టైల్ 'చికెన్ ఫ్రై' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ స్కిన్ లెస్ అరకేజీ.. ఉల్లిపాయ ఒకటి, నూనె తగినంత, పచ్చిమిర్చి రెండు, కరివేపాకు 4 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, ధనియాల పొడి, పసుపు, కారం తాగినంత, చింతపండు పులుసు తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, కొత్తిమీర తురుము.. తీసుకోవాలి.
'చికెన్ ఫ్రై' తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ను ఉప్పు వాటర్ లో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ లోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నెపెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి , కరివేపాకు, అల్లం పేస్టు వేసి వేయించుకోవాలి.
ఆ మిశ్రమంలో చికెన్ ను వేసి 3 నిమిషాలపాటు ఫ్రై చేసుకోవాలి. అందులో వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పదార్థాలన్నీ చికెన్ పట్టేంత వరకూ వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అలా ఉడికించుకోవాలి. ప్రతి ఐదు నిమిషాలకోసారి కలుపుతూ చికెన్ డార్క్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. అలా దాదాపు 45 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి.

తర్వాత అందులో చింతపండు రసం, మిరియాల పొడి, కొత్తిమీర తరగు, కరివేపాకు తగినంత వేసి బాగా కలుపుకోవాలి. అలా ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారి రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.. ఘుమఘుమలాడే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే..
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications