పాలకూరతో నయా స్టైల్ రెసిపీ.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్..!
పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. చాలామంది పాలకూరతో పప్పు, పచ్చడి, ఫ్రై వంటివి చేసుకుని తింటారు. ఇంకొంతమంది టమాటోతో కలిపి పాలకూరను వండుకుంటారు. అయితే టమాటోలు వేయకుండానే టేస్టీగా తయారు చేసుకునే రెసిపీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇలా ఉల్లికారంతో పాలకూర కర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి ఈ నయా పాలకూర రెసిపీని ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
నయా పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పాలకూర తరుగు 120 నుంచి 150 గ్రాములు, నూనె తగినంత, పోప్ దినుసులు ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు కొద్దిగా, ఉల్లికారం తయారీకి ఉల్లిపాయలు రెండు, వెల్లుల్లి రెబ్బలు ఐదారు, చింతపండు కొద్దిగా , పసుపు చిటికెడు, ఉప్పు, కారం రుచికి తగినంత, ధనియాల పొడి అర టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, ఇంగువ చిటికెడు తీసుకోవాలి.
పాలకూర తయారీ విధానం చూస్తే.. ముందుగా పాలకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పాలకూరను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. అలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీలో వేయాలి. అందులోనే నానబెట్టిన చింతపండు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఇంగువ, కరివేపాకు వేసి ఆ తర్వాత పాలకూర తరుగు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ మిశ్రమాన్ని వేయాలి.
ఆ తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి దింపితే సరి.. సూపర్ టేస్టీ పాలకూర కర్రీ రెడీ అయినట్టే..
-
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications