Vaccine వచ్చేసింది. ఇక ఏ మహమ్మారి వచ్చినా భయం లేదు!
సీజన్ మారిందంటే చాలు.. ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే చాలు, వరుసగా అందరికీ అంటుకుంటుంది. ఆ తుమ్ములు, ఆ తలనొప్పి, ముక్కు కారడం.. అబ్బో! ఆ నరకం వర్ణనాతీతం. జలుబుకు లోకంలో మందే లేదని ఇప్పటిదాకా అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆ చింత అక్కర్లేదు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒకే ఒక్క 'మ్యాజికల్ నాసికా స్ప్రే' కనిపెట్టారు. ఇది ముక్కులో వేసుకుంటే చాలు.. అటు జలుబు, ఇటు అలర్జీ.. చివరకు ప్రాణాంతక వైరస్లు కూడా మీ దరిచేరవు! ఈ వినూత్న టీకా విశేషాలు మీకోసం..
ఇప్పటివరకు మనం వాడే టీకాలు (Vaccines) ఒక్కో జబ్బుకు ఒక్కోలా పనిచేస్తాయి. కానీ ఈ కొత్త టీకా అలా కాదు. ఇది ఒక "సార్వత్రిక టీకా" (Universal Vaccine). అంటే ఇది ఒక్క జలుబునే కాదు.. ఫ్లూ, కోవిడ్, బాక్టీరియా వల్ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, చివరకు మనల్ని వేధించే డస్ట్ అలర్జీల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నింటికీ ఇది ఒకే ఒక్క పరిష్కారంలా మారబోతోంది.

ఈ Vaccine శరీరంలో 24/7 సెక్యూరిటీ గార్డ్స్!
ఈ స్ప్రే మన శరీరంలోకి వెళ్ళగానే ఒక వింత జరుగుతుంది. ఇది మన ఊపిరితిత్తులలో ఉండే తెల్ల రక్త కణాలను (మాక్రోఫేజెస్) ఫుల్ అలర్ట్ మోడ్‌లోకి పంపిస్తుంది. అంటే మన బాడీలోకి ఏ కొత్త వైరస్ ప్రవేశించినా, ఈ కణాలు వాటిని వెంటనే పసిగట్టి, శరవేగంతో దాడి చేసి చంపేస్తాయి. జంతువులపై చేసిన ప్రయోగాల్లో ఈ స్ప్రే వేసిన తర్వాత వైరస్ల ప్రభావం 1,000 రెట్లు తగ్గినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఒక్కసారి వాడితే మూడు నెలల దాకా మన బాడీలో ఒక పవర్ఫుల్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టే!
అలర్జీలతో యుద్ధం.. గెలుపు మనదే!
చాలామందికి దుమ్ము పడదు (Dust Allergy), దానివల్ల ఆస్తమా వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ నాసికా స్ప్రే అలాంటి అలర్జీల ప్రభావాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. సాధారణంగా ఏ వైరస్ వచ్చినా దానికి మందు కనిపెట్టడానికి నెలల సమయం పడుతుంది. కానీ ఈ స్ప్రే మీ దగ్గర ఉంటే, ఏ కొత్త మహమ్మారి వచ్చినా అది మీ ప్రాణాలను కాపాడే రక్షణ కవచంలా పనిచేస్తుంది.
భవిష్యత్తుపై కొత్త ఆశలు
ప్రస్తుతానికి ఎలుకలపై ఈ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. త్వరలోనే మనుషులపై పరీక్షలు (Human Trials) నిర్వహించబోతున్నారు. "ఇది ఇప్పటివరకు మనం చూసిన టీకాలకు పూర్తి భిన్నమైనది" అని ప్రొఫెసర్ బాలి పులేంద్రన్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గానీ పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో 'శీతాకాలం జలుబు' అనేది కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది!
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications