టమాటా, చిక్కుడుకాయ కూర ఇలా చేసి తింటే రుచితో పాటు ఈ బెనిఫిట్స్!
ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలే మన శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదం చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో కూరలు ఎక్కువగా తినడం శరీరానికి మేలు చేస్తుంది. కావలసిన పోషకాలను అందిస్తుంది. ఈరోజు మనం టమాటా చిక్కుడు కాయ కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. టమాటా చిక్కుడు కాయల కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం.
టమాటా చిక్కుడు కాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
గింజల చిక్కుడుకాయలు- అర కిలో చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్నవి
టమాటాలు- పెద్దవి 4
పచ్చిమిరపకాయలు- 4
ఉల్లిపాయలు- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూను
పసుపు- అర స్పూను
ఉప్పు- రెండు స్పూన్లు రుచికి తగినంత
కారం- స్పూనున్నర మీరు తినే కారాన్ని బట్టి
ధనియాల పొడి - ఒక స్పూను
పోపు గింజలు- ఒక స్పూను
నూనె- మూడు స్పూన్లు
కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని మూడు స్పూన్ల నూనె వేసి అందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆపై అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఆపై అందులో అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేయాలి. ఆపై తుంచి పెట్టుకున్న గింజల చిక్కుడుకాయల ముక్కలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి చిక్కుడుకాయలను మగ్గనివ్వాలి.
ఇలా వండుకుంటే కూర బాగుంటుంది
ఆ తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, ఒకటిన్నర స్పూను కారం వేసి బాగా కలుపుకొని మూతపెట్టి సిమ్‌లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. టమాటాలో ఉన్న నీరంతా ఊరి చిక్కుడుకాయ ముక్కలు అంతా మెత్తగా ఉడుకుతాయి. ఒకవేళ టమాటాలో నీరు ఊరక పోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
రుచితో పాటు ఆరోగ్యానికి టమాటా, చిక్కుడుకాయ
చిక్కుడుకాయ టమాట బాగా ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత అందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఆపై ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ, టమాట కూర వల్ల కేవలం మన నోటికి రుచి మాత్రమే కాదు, మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి .
టమాటా, చిక్కుడుకాయ కూరతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
టమాటాల లో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చిక్కుడుకాయలలో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. బీపీ, షుగర్ నియంత్రించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గటానికి కూడా చిక్కుడు బాగా ఉపయోగపడుతుంది.
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications