సర్వరోగ నివారిణి ఈ 'చికెన్ సూప్'.. ఎలా తయారు చేసుకోవాలంటే..?
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు, దగ్గు వస్తుంటాయి. అయితే చల్లని వాతావరణంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగాలని చాలామందికి ఉంటుంది. మరి నోరూరించే ఈ చికెన్ సూప్ ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? ఎక్కువ పదార్థాలు లేకుండానే స్పైసీ, అండ్ టేస్టీ చికెన్ సూప్ ను తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ చూడండి. చికెన్ సూప్ తయారు చేసుకోడానికి ముందుగా కావాల్సిన పదార్థాలను చూస్తే..
చికెన్ 300 గ్రాములు , నెయ్యి లేదా నూనె - 4 టేబుల్ స్పూన్ లు , ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొత్తి మీర తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి, సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్కొద్దిగా, కార్న్ ఫ్లోర్, ఒక కోడి గుడ్డు తీసుకోవాలి. ఉల్లిపాయ, క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె పోసుకుని చికెన్ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికాక ఆ మిశ్రమాన్ని వేరొక ప్లేటులోకి తీసుకోవాలి. ఆ చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనపెట్టుకోవాలి. తర్వాత మళ్లీ గిన్నె పెట్టి నెయ్యి లేదా నూనె పోసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉల్లిపాయ, క్యారెట్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుని పెద్ద మంటపై వేగనియ్యాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి మరోసారి బాగా మరిగించాలి.

ఆ మిశ్రమంలోనే అప్పటికే సిద్ధం చేసిన మిరియాల పొడి, వెనిగర్, టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ లను వేసి బాగా కలుపుకోవాలి. అలా కొద్దిసేపు మరిగాక అందులో ఒక ఎగ్ కొట్టాలి. అలా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక.. అందులో కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేస్తే చికెన్ సూప్ రెడీ అయినట్టే..
-
సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!











Click it and Unblock the Notifications