వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని వాష్బేసిన్లు ఉండాలి?
వాస్తు అంటే ప్రదేశం అనే అర్థం వస్తుంది. వాస్తు శాస్త్రం అంటే ఆ ప్రదేశం విధివిధానాలను నిర్ణయించేది. మనకు పూర్వీకులు అందించిన అద్భుతమైన ఈ శాస్త్రం ఎన్నోరకాల సమస్యల నుంచి కాపాడుతోంది. అనేకరకాల సమస్యలు రాకుండా ముందుగానే నివారిస్తుంది. అటువంటి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకున్నప్పుడు అందులో ఎన్ని వాష్ బేసిన్లు ఉండాలి? దోషాలుంటే ఎలా నివారించుకోవాలి? పిల్లలు చదువుకోవడానికి గది ఎక్కడ ఉండాలి? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని వాష్ బేసిన్లు అయినా ఉండొచ్చు.
సరి సంఖ్య, బేసి సంఖ్య అంటూ నియమాలు లేవు.
సంఖ్యతో ఎటువంటి దోషం రాదు.
ఏ రూంలో అయినా పెట్టుకోవచ్చు.
అయితే వాయువ్యంలో లేదంటే ఆగ్నేయంలో ఉంటే చాలా మంచిది.
దక్షిణ దిక్కు గోడలకు, ఉత్తర దిక్కు గోడలకు పెట్టుకోవాలి.
తూర్పు దిక్కు, పడమర దిక్కు గోడలకు పెట్టొద్దు.
ఎందుకంటే ఈ దిక్కులవైపు ఉమ్మి వేయకూడదు.

కిచెన్ సింక్ ఎప్పుడూ వంట స్టవ్ కు దూరంగా ఉండాలి.
వీలైతే సింక్ వంటగదిలో ఈశాన్య మూలలో ఉండాలి.
భోజనం చేసే చోట వాష్ బేసిన్ ఉత్తర లేదా తూర్పు గోడకు ఉండాలి.
బేసిన్ నేరుగా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు.
వాష్ బేసిన్ కుళాయిలు ఎప్పుడూ కారకూడదు.
లీకేజీ ఉంటే వెంటనే బాగుచేయించాలి.
వాష్ బేసిన్ పై ఉండే అద్దం పగలకూడదు. అది తళతళలాడుతూ ఉండాలి.
పిల్లలు చదువుకోవడానికి కచ్చితగా ఒక గది ఉండాలి.
హాల్లో టీవీ ఉంటుంది కాబట్టి వారు శ్రద్ధగా చదవరు.
పిల్లలు చదువుకునేందుకు గది ఉత్తర దిక్కులో ఉండాలి.
గదిలో బరువుగా ఉండే బ్లాక్ బోర్డులు, పేపరు చార్టులు ఉత్తరం, తూర్పు గోడలకు పెట్టొద్దు.
పిల్లలు తూర్పు, ఉత్తరంవైపు తిరిగి చదువుకుంటే సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది.
బ్లాక్ బోర్డులు, పేపరు చార్టులు తూర్పు, ఉత్తరం గోడలకు పెట్టొద్దు.
అలాగే పిల్లల గదిలో బాత్ రూం ను ఈశాన్యం కాకుండా ఏ దిక్కులో అయినా కట్టుకోవచ్చు.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications