Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పూర్వాషాఢ నక్షత్రంలో శుక్రుడు..30 నుంచి ఈ రాశుల పంట పండింది

నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, కళలకు, విలాసాలకు, ఐశ్వర్యానికి కారకుడు. రాక్షసులు గురువైన శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకానికి తిరుగండదు. ఈనెల 30వ తేదీ నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించనున్న శుక్రుడి వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఆనందపు మతాబులు వెలగబోతున్నాయి. అన్ని రాశులపై ఈ ప్రభావం ఉన్నా.. ప్రధానంగా 4 రాశులకు మాత్రం విపరీతమైన ప్రయోజనాలను కల్పించబోతోంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
కొంతకాలంగా ఈ రాశివారిని వేధిస్తున్న సమస్యలన్నీ ఒక్కసారిగా పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నవారి కలలన్నీ నిజం కాబోతున్నాయి. ఆస్తికి సంబంధించిన పనులు కలిసివస్తాయి. వివాదాలు తీరిపోతాయి. ప్రతి పనిలోను విజయాన్ని అందుకుంటారు. కెరీర్ పరంగా మంచి అవకాశాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

four zodiac signs will get amazing benefits and get huge money due to venus enter purvashada nakshatram

వృషభ రాశి
వీరికి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కొంతకాలం ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నవారికి, ప్రయత్నాలు చేస్తున్నవారికి ఇది మంచి సమయం. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా జీవితంలో అత్యంత సానుకూలత కలిగిన సమయం అని చెప్పొచ్చు. అనేకరకాలుగా కలిసిరావడంతోపాటు ఆదాయం పెరగనుంది.

మీన రాశి
పిల్లల వైపు నుంచి శుభవార్తలను అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యం ఉంది. మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇది అత్యంత కలిసివచ్చే సమయం అని చెప్పొచ్చు. ఆదాయం పెరగడంతోపాటు అన్నివైపుల నుంచి చేతికి రావాల్సిన డబ్బు అందుతుంది. ఒకరకంగా ఈ రాశివారికి ఇది స్వర్ణయుగం అని జ్యోతిష్య పండితులు అభివర్ణిస్తున్నారు.

తులా రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలను అందుకుంటారు. కొత్తగా పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు బాగుంది. మానసికంగా వీరు చాలా దృఢంగా ఉండి విజయాలను సాధిస్తారు. అత్యంత శుభప్రదమైన సమయం అని చెప్పొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+