Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రథ సప్తమి పండగ: ఎలాంటి శ్లోకాలు చదివితే పాపాలు నాశనం అవుతాయంటే

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఫిబ్రవరి 1న శ‌నివారం రథసప్తమి పర్వదినం. రథ సప్తమిని మఘ సప్తమి కూడా అంటారు. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్టారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. మాఘమాసమంతా సూర్యారాధనకు, అరుణ పారాయణకు, సూర్యనమస్కారాలకు, విష్ణు సహస్రనామ పారాయణకు ముఖ్యమైనది. ప్రాత:కాలంలో చేసే స్నాన, జప, తపములు చాలా ఉత్తమమైనవి.

Ratha Saptami 2020: devotees to chant Slokas

ఈ మాసం శ్రీమన్నారాయణునికి, సూర్యనారాయణునికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు "దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!" అని మూడు మునకలు వేసిన తరువాత నదీ, బావి మొదలైనవాటియందు స్నానమైనా, ఈ క్రింది శ్లోకం చదువుతూ సూర్యనారాయణునికి అర్ఘ్యమివ్వాలి.

"సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!".

'నమస్కారం ప్రియ:సూర్య:' అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడు. అందుకని ఈ మాసమంతా స్నానానంతరం సూర్యనమస్కారాలు చేయాలి.

ఇక మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది. మరియు ప్రతీ మాఘ ఆదివారం చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.

రథసప్తమి నాడు ప్రాతఃకాలముననే ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట.

శ్లో॥ సప్తసప్తమహాసత్వసప్త ద్వీపావసుంధరా।
సప్తార్కపర్ణాన్యాదాయ సప్తమ్యాం స్నానమాచరేత్॥ అని భక్తులు స్మరించుకొంటే అంతా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+