Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పరివర్తన యోగంతో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే అవుతోంది

ఈ నెల 29వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు మంచి శుభయోగం ఉంది. నవగ్రహాల్లో కీలక గ్రహాలైన బృహస్పతి, బుధుడు ఈ రాజయోగాలను కల్పిస్తున్నారు. మిథున రాశిలో బృహస్పతి, ధనుస్సు రాశిలో బుధడు సంచరించడమే దీనికి కారణం. మిథున రాశికి అధిపతి బుధుడు. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. గ్రహాల మధ్య ఏర్పడుతున్న పరివర్తనతో పరివర్తన యోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఆరు రాశులవారు తమ జీవితంలో అందలం ఎక్కుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

తులా రాశి
వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. వంద శాతం ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి.

six zodiac signs will get amazing financial beneifts and get huge money due to Jupiter and mercury transit

ధనుస్సు రాశి
ఆదాయం పెరుగుతుంది. రెండుసార్లు ధనయోగం ఉంది. ప్రయాణాలవల్ల లాభాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు, ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ చాలా సలువుగా పరిష్కారమవుతాయి. వాహన యోగం ఉంది. అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.

కుంభ రాశి
రాజకీయంగా అధికారం వస్తుంది. విదేశాల నుంచి ఉద్యోగం లేనివారు కూడా అవకాశాలను అందుకుంటారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ వంటివాటిల్లో బాగా కలిసివస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

మేష రాశి
తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. న్యాయపరమైన కేసులన్నీ సానుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ యానం ఉంది. అలాగే ధనయోగం, అధికార యోగం ఉంది. అధికార యోగం అనేది జీవితంలో ఒకసారికే పరిమితమవుతుంది. సీనియర్లకు కాకుండా జూనియర్లకు పదోన్నతులు దక్కుతాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.

మిథున రాశి
రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. బాగా డబ్బుకన్న కుటుంబంతో వివాహం కుదురుతుంది. లేదంటే ప్రేమలో అయినా పడతారు. స్టాక్ మార్కెట్ కుసంబంధించినవి అంచనాలకు మించి లాభాలను అందిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు. విదేశాలకు వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా వెళతారు.

సింహ రాశి
బాగా డబ్బుకన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహమవుతుంది. ఉద్యగంలో మీ సమర్థతను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+