Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవంబర్ 16నుండి వీరి దశ తిరిగినట్టే.. రాసుకోండి!

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. గౌరవానికి, ఆత్మకు ప్రతీకగా భావించే సూర్యుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. ఇక సూర్య గోచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

సూర్య సంచారం, ఆ రాశిలో త్రిగ్రాహి యోగం
నవంబర్ 16వ తేదీన సూర్యుడు తన బలహీనమైన రాశి నుండి విముక్తి చెంది వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఇదే సమయంలో వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధుడు ఉంటారు. ఈ మూడు గ్రహాల కలయిక త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

these zodiac signs will be lucky with sun transit and also trigrahi yoga from november 16th

మేష రాశి
మేషరాశిలో సూర్య భగవానుడు ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్య సంచారం తో పాటు సూర్యుడు ఏర్పరిచిన యోగం కారణంగా మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఇల్లు లేదా వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు కూడా గణనీయమైన విజయాలను పొందుతారు. బహుళ జాతి కంపెనీలలో పనిచేసేవారు అదృష్ట జాతకులు అవుతున్నారు.

సింహరాశి
సింహరాశి జాతకులు సూర్య సంచారం కారణంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ రాశి వారు బృహస్పతి కారణంగా చాలా లాభాలను పొందుతారు. అనేక రంగాలలో విజయాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించబడతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+