వాస్తు ప్రకారం వీటిని ఫాలో అయితే సంపద వస్తుంది. అవుతున్నారో? లేదో? ఒకసారి చూసుకోండి
వాస్తు ప్రకారం అన్నింటినీ అనుసరిస్తున్నప్పటికీ సంపద రావడంలేదని, దోషాలు ఉన్నాయేమో, ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నామంటూ చాలామంది బాధపడుతుంటారు. కానీ వాస్తు అంతా బాగున్నప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలకు తప్పనిసరిగా పాటిస్తుండాలి. వీటివల్ల ధననష్టం కలగకుండా, విభేదాలు తలెత్తకుండా , అనుకున్న పనులు జరుగుతుంటాయి. ఈ ప్రకారం మనం పాటించాల్సిన చిట్కాలు ఏమిటి? అనే వివరాలను తెలుసుకుందాం.
ఉదయం ఇంటిని శుభ్రం చేసిన తర్వాత పసుపును నీటిలో కరిగించాలి.
ఆ నీటిని తమలపాకుతో ఇల్లంతా చల్లాలి.
ఇలాగే గంగాజలం కూడా చల్లాలి.
దీనివల్ల ప్రతికూల శక్తులు పోవడంతోపాటు వాస్తు దోషాలు కూడా పోతాయి.

ఆధ్యాత్మిక పుస్తకాలు తప్పుడు దిశలో ఉండకూడదు.
ఇవి ఎప్పుడూ కూడా ఇంటికి పడమర వైపు ఉండాలి.
పరుపులోకి, దిండు కింద పెట్టడం చాలా అశుభం.
ఇంట్లో క్రమం తప్పకుండా ఆవునెయ్యితో దీపం వెలిగించాలి.
గంటను కూడా ప్రతిరోజు మోగించాలి.
దీనివల్ల వ్యతిరేక శక్తులున్నీ బయటకు వెళ్ళిపోతాయి.
ఇంట్లో శంఖాన్ని ఊదడంవల్ల దురదృష్టం తొలగిపోతుంది.
దేవుడి పటాలకు పెట్టిన పూలు తీసేసి కొత్తపూలు పెట్టాలి.
వాస్తు ప్రకారం ఇంట్లో ప్లాస్టిక్, ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు.
వాటిని ఇంటినుంచి తీసేయాలి.
కుండీలో పువ్వులు ఎండిపోతే కొత్త మొక్కలు నాటి.
ఈశాన్యంలో తులసి మొక్కను నాటాలి.
ప్రతిరోజు సాయంత్రం స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి.
తులసీదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం.
చీపురు పెట్టే స్థలంలో బరువైన వస్తువు ఉండకూడదు.
చీపురుకు కాలు తగులుంటే ధన నష్టం కలుగుతుంది.
చీపురును తలుపు దగ్గర పెట్టకూడదు. దీనివల్ల వాస్తు దోషం కలుగుతుంది.
ఇంట్లో గోడలకు ఆహ్లాదకరమైన ఫొటోలు ఉండాలి.
ఇలా చేస్తే మానసిక సమస్యల నుంచి బయటపడతారు.
అయితే హింసాత్మక చిత్రాలు ఉండకూడదు.
రాత్రివేళ నిద్ర పట్టకపోతే వారు దక్షిణం వైపు పడుకోవాలి.
ఇలా చేస్తే ఆ వ్యక్తి స్వభావంలో మార్పు వచ్చి నిద్రలేమి తొలగిపోతుంది.
ప్రధాన తలుపుకు అశోక చెట్లను ఇరువైపులా నాటాలి.
ఈశాన్యంలో చెత్త పేరుకుపోకుండా చూడాలి.
భారీవస్తువులు, యంత్రాలు ఉంచకూడదు.
ఈశాన్యం మూలలో స్ఫటిక శ్రీయంత్రాన్ని ప్రతిష్టించాలి.
ఇది వాస్తు దోషాలను పోగొడుతుంది.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications