వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంట్లో దొంగతనాలకు వాస్తు దోషాలకు లింక్.. ఈ దోషాలుంటే తక్షణం సరిదిద్దుకోండి

|
Google Oneindia TeluguNews

వాస్తు నియమాలకు అనుగుణంగా లేని ఇల్లు కొన్నిసార్లు దొంగతనాలకు గురవుతుంటాయి. ఇంట్లో వాస్తు దోషాలు, తలుపుల సంఖ్య కూడా ఇంట్లో జరగనున్న దొంగతనాలకు సంకేతంగా నిలుస్తుంది. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలి. అంతేకాదు తలపుల సంఖ్యను కూడా వాస్తు నియమాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి యజమాని తప్పనిసరిగా తలుపుల పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి ఇంట్లోనూ తలుపుల స్థానం, పరిమాణం మరియు తలుపుల సంఖ్య పై దృష్టి పెట్టాలి.

ఉత్తర, పశ్చిమ దిశలో బంగారం, నగదు పెడితే చోరీ జరిగే అవకాశం

ఉత్తర, పశ్చిమ దిశలో బంగారం, నగదు పెడితే చోరీ జరిగే అవకాశం


దొంగతనాలు వంటి చెడు ప్రభావాలను నుండి మనల్ని మనం రక్షించుకోవడం కి జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో, వాస్తు నియమాల పట్ల కూడా జాగ్రత్త వహించడం అంతే అవసరం. దొంగతనాలకు గురికాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ విలువైన వస్తువులు మరియు నగదును ఉత్తర, పశ్చిమ దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఇది దోపిడీ అవకాశాలను పెంచే దిశ. ఉత్తర, పశ్చిమ దిశలో బంగారం, నగదు పెడితే చోరీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పనివారిని నైరుతి దిశలో ఉంచితే చోరీలకు ఛాన్స్

పనివారిని నైరుతి దిశలో ఉంచితే చోరీలకు ఛాన్స్


ఇక ఇంట్లో పనిచేసే వారిని ఇంటి నైరుతి ప్రాంతంలో ఉండేందుకు గది కేటాయించండి. ఒకవేళ నైరుతి ప్రాంతంలో పనిచేసే వారు ఉంటే వారిలో దోపిడీ చేసే స్వభావం కలుగుతుంది. ఇది వారిలో దొంగ బుద్ధిని ప్రేరేపిస్తుంది. కాబట్టి నైరుతిదిశలో పనివారు ఉండకుండా చూసుకోండి. అంతేకాదు ఇంటికి మూడు తలుపులు ఉంటె దొంగతనాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మూడు తలుపు లేకుండా చూసుకోవాలి.

ఇంటి తలుపుల విషయంలో వాస్తు నియమాలు పాటించటం అవసరం

ఇంటి తలుపుల విషయంలో వాస్తు నియమాలు పాటించటం అవసరం


ఇక ఇంటికి ప్రవేశద్వారం అయిన ప్రధాన ద్వారం మిగతా తలుపుల కంటే పెద్దగా ఉండేలా చూడాలి. మొత్తం తలపుల సంఖ్యను 2,4,6,8 మరియు పన్నెండు వందల సంఖ్యలో లెక్కించాలి. బేసి సంఖ్యలో తలుపులను పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. బేసి సంఖ్యలో తలుపులు దొంగతనాలకు కారణమవుతాయి .ఇక 10 తలుపులు ఉండటం అశుభం కాబట్టి పది తలుపులు లేకుండా చూసుకోవాలి. ఇక ప్రధాన ద్వారానికి రెండు తలుపులు ఉండేలా చూసుకోండి.

వాయువ్య దిశలో నగలు, నగదు పెడితే దొంగతనాలు జరిగే అవకాశం

వాయువ్య దిశలో నగలు, నగదు పెడితే దొంగతనాలు జరిగే అవకాశం

తూర్పు లేదా ఉత్తర దిశలో ఒకే తలుపు ఉంటే మంచిది. అయితే దక్షిణంలో తలుపు ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఇంకో తలుపు ఉన్నట్లయితే దోపిడి, శత్రుత్వం, వ్యాధులు, ధననష్టం, సంతాన నష్టం మొదలైన సమస్యలు కలుగుతాయి. ఆ విధంగా ఉండకుండా చూసుకోవాలి. దొంగతనాలు జరగకుండా నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలు లాంటి విలువైన వస్తువులు ఇంట్లో వాయువ్య దిశలో ఉంచకూడదు. అలా ఉంచి దొంగతనాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
వాస్తు నియమాలు పాటించినా అప్రమత్తంగా ఉండాల్సిందే

వాస్తు నియమాలు పాటించినా అప్రమత్తంగా ఉండాల్సిందే


ఇక వాస్తు నియమాలను పాటిస్తున్నామని వస్తువులను అజాగ్రత్తగా పెట్టినా, బంగారం, నగదు వంటి వాటిపై శ్రద్ధ లేకున్నా అవి పోయే ప్రమాదం ఉంటుంది. దొంగతనాల విషయంలో మనం సహజంగా అప్రమత్తంగా ఉండటంతో పాటుగా, వాస్తు నియమాలను కూడా పాటిస్తే దొంగతనాల బారినుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!!

English summary
home thefts happens sometimes with vastu defects.. Correct these errors immediately. If gold and cash are kept in the north, west and northwest directions, there is a possibility of theft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X