• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: అన్నం తినేటప్పుడు తిడితే మహాదోషం; భోజనం సమయంలో చెయ్యకూడని తప్పులివే!!

|
Google Oneindia TeluguNews

భోజనం చేసే ముందు కూడా నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు ఆ భోజనం పట్ల భక్తిభావం ఉండాలి. ఇక భోజన సమయంలో తిట్టటం కూడా దోషకారణం. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. ఇక ఒక్కొక్కసారి వాళ్లు భోజనం చేసే సమయంలోనే పెద్దవాళ్లు పిల్లలపై ఆగ్రహం ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు తిట్టారు అన్న బాధలో, ఆవేదనను అణుచుకుంటూ పిల్లలు భోజనం చేస్తే అది వంట పట్టదని, తద్వారా పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే భోజనం చేసే సమయంలో ఎప్పుడూ పిల్లల్ని తిట్టకూడదని సూచిస్తూ ఉంటారు.

vastu tips: ఈ పనులు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం; ఊహించని లక్ష్మీ కటాక్షం!!vastu tips: ఈ పనులు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం; ఊహించని లక్ష్మీ కటాక్షం!!

భోజనం చేసేటప్పుడు ఈ పని చేస్తే దోషం.. కచ్చితంగా దాని ప్రభావం

భోజనం చేసేటప్పుడు ఈ పని చేస్తే దోషం.. కచ్చితంగా దాని ప్రభావం


భోజనం చేసిన వారిపై ఆవేశపడటం వలన శాస్త్ర సంబంధమైన దోషాలు కూడా ఎదురవుతాయని చెబుతూ ఉంటారు. కొంతమంది భోజనం చేసే సమయంలో ఆగ్రహంతో, తినే పళ్లెం పక్కకు నెట్టడం, అన్నాన్ని విసిరి కొట్టడం చేస్తూ ఉంటారు. ఇది అత్యంత దోష కారణమవుతుందని పెద్దలు చెబుతున్నారు. ఎవరైతే అన్నం నిర్లక్ష్యం చేస్తారో, అన్నాన్ని విసిరి కొడతారో, వారికి అన్నం దొరకకుండా పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు .

అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తే తిండి దొరకని, తినలేని పరిస్థితులు

అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తే తిండి దొరకని, తినలేని పరిస్థితులు


అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతూ ఉంటారు. అన్నపూర్ణ దేవి అని కూడా అన్నానికి దైవ స్థానం ఇచ్చారు. అటువంటి అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తే, కళ్ళముందు అన్నం ఉన్నప్పటికీ తినలేని పరిస్థితులు వస్తాయని, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆహారం ఎదురుగా ఉన్న తినకూడని ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం పైన విసుగు ,నిర్లక్ష్యం చూపించకూడదని పెద్దలు చెబుతున్నారు.

ఇంట్లో గొడవలతో అన్నం తినకున్నా దోషమే

ఇంట్లో గొడవలతో అన్నం తినకున్నా దోషమే


కొంతమంది ఇంట్లో గొడవ పడి అన్నం తినడం మానేస్తారు అయితే ఎలాంటి పర్వదినం కాకుండా అలా అందరూ గొడవలతో అన్నం మీద అలగడం, భోజనం చేయకుండా పడుకోవడం దోషమని పెద్దలు చెబుతున్నారు. అందుకే భోజనం ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. పవిత్రమైన స్థలంలో చేయాలి. భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు. ఎటువంటి కోపతాపాలకు తావు లేకుండా భోజన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

అన్నాన్ని డస్ట్ బిన్ లో పారెయ్యటం దోషం.. వారు అనారోగ్యం బారిన పడే అవకాశం

అన్నాన్ని డస్ట్ బిన్ లో పారెయ్యటం దోషం.. వారు అనారోగ్యం బారిన పడే అవకాశం


ఇక కొంతమంది పిల్లలు, పెద్దలకు తెలియకుండా ప్లేట్లలో పెట్టిన అన్నాన్ని తీసుకువెళ్లి డస్ట్ బిన్ లో పారేస్తూ ఉంటారు. అన్నం తినాలంటే నే చిరాకును ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఉండని, అన్నాన్ని పారేయడం వల్ల వారికి దోషం వస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కోటి విద్యలు కూటి కొరకే అన్న విషయాన్ని గుర్తుంచుకొని, ఎవరు ఎంత బిజీగా ఉన్నా, సమయం ప్రకారం భోజనం చేయాలని సూచించబడింది. ఇక భోజనం చేసే సమయంలో ఎవరు ఎవరినీ ఎట్టి పరిస్థితులలోనూ తిట్ట రాదని సలహా ఇవ్వబడింది. అన్నం తినే సమయంలో పైన చెప్పిన పొరపాట్లు చేస్తే ఆ దోష ప్రభావం కచ్చితంగా మనపై ఉంటుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Elders say that it is a great sin to scold while eating food. It is suggested to eat calmly. elders telling the mistakes that should not be done during the meal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X