వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఎప్పుడూ చిరాకులు,ఆర్ధికఇబ్బందులు.. వీటికి దూరంగా ఉండండి!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రం ప్రకారం రూపొందించబడిన, అలంకరించబడిన, శుభ్రంగా ఉన్న ఏదైనా ఇల్లు ఆనందం, ఆరోగ్యం, సంపద మరియు అదృష్టాన్ని కలిగి ఉంటుంది. భారతీయ వాస్తు చైనీస్ ఫెంగ్ షుయ్‌తో చాలా సారూప్యతలను పంచుకుంటుంది. వాస్తు శాస్త్రంలో హిందూ సంప్రదాయం ప్రకారం మన ఇంటిలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా సహజ సానుకూలమైన శక్తి ఇంటికి లభిస్తుంది. మీరు వాస్తు పద్ధతులను అనుసరించి మీ ఇంట్లో వస్తువులను ఉంచినట్లయితే, మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఖచ్చితంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణుల స్థిరమైన నమ్మకం.

vastu tips: ఇంటి శుభ్రతకు వాస్తు.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లోనే మహాలక్ష్మి నివాసం!!vastu tips: ఇంటి శుభ్రతకు వాస్తు.. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లోనే మహాలక్ష్మి నివాసం!!

 వాస్తు దోషాల వల్ల ఇళ్ళల్లో సమస్యలు.. కుటుంబంలో సుఖ సంతోషాలు దూరం

వాస్తు దోషాల వల్ల ఇళ్ళల్లో సమస్యలు.. కుటుంబంలో సుఖ సంతోషాలు దూరం

కష్టపడి పనిచేసినప్పటికీ ప్రజలు సంపద, సౌలభ్యం మరియు సంతోషానికి సంబంధించిన అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు . అయితే ఇది బహుశా వాస్తు దోషం వల్ల కావచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. అటువంటి వాస్తు దోషాలను గురించి తెలుసుకొని, వాస్తు కు వ్యతిరేకంగా ఇంట్లో ఉండే వస్తువులు గురించి తెలుసుకుంటే, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తు దోషం తొలగి ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి వీలుంటుందని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతికూల శక్తి నశించి శాంతి నెలకొంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆలోచనలలో మరియు ఇంటిలో సానుకూలతను తీసుకురాగల కొన్ని విషయాలు ఉన్నాయి.

 యుద్ద సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు ఇళ్ళల్లో ఉండకూడదు

యుద్ద సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు ఇళ్ళల్లో ఉండకూడదు


ఇంట్లో ప్రతికూల ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి. ఇంట్లో ఉంచకూడని వస్తువులను ఇక్కడ జాబితా చూసినట్లయితే ఇంట్లో ఎప్పుడూ ఆహ్లాదాన్ని కలిగించే చిత్రాలను ఉంచడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్ళల్లో ఎప్పుడూ యుద్ధం లేదా యుద్ధ సన్నివేశాలు, రామాయణ, మహాభారత యుద్ధ సన్నివేశాలను ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యుల మధ్య పోటీని వర్ణిస్తాయి. ఎప్పుడూ ఆ ఇళ్ళలో యుద్ధ వాతావరణమే ఉంటుంది.

పువ్వులు పండ్లు లేని చెట్లు, మునిగిపోతున్న ఓడల చిత్రాలు ఉండకూడదు

పువ్వులు పండ్లు లేని చెట్లు, మునిగిపోతున్న ఓడల చిత్రాలు ఉండకూడదు

అంతేకాదు పూలు, పండ్లు లేని చెట్టు చిత్రాలు, ఎండిపోయి మోడువారిన చెట్లు చిత్రాలు , మునిగిపోతున్న ఓడ లేదా పడవ, సాక్స్, కత్తి యుద్ధ చిత్రాలు, వేట చిత్రాలు, ఇంద్రజలం (మాయాజాలం), బంధించిన ఏనుగులు, విచారంగా, ఏడుపుతో ఉన్న వ్యక్తుల చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. ప్రతికూల చిత్రాల వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

జంతువులు, పక్షుల చిత్రాలు లేదా విగ్రహాలు ఉండకూడదు

జంతువులు, పక్షుల చిత్రాలు లేదా విగ్రహాలు ఉండకూడదు


పందులు, పాములు, గాడిదలు, డేగలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, రాబందులు, పావురాలు మరియు కాకుల వంటి జంతువులు మరియు పక్షుల చిత్రాలు, పెయింటింగ్‌లు మరియు శిల్పాలను ఇళ్లలో పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం, ఒక జంట పడకగదిలో ఒక్క పక్షి లేదా జంతువును కూడా ప్రదర్శించకూడదు. కొందరు గుర్రాల పెయింటింగ్స్ పెడుతుంటారు. అలా పెట్టటం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది. ప్రకృతిలోని క్రూరత్వాన్ని వర్ణించే ఏ వన్యప్రాణుల చిత్రపటాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఇది ఇంటిలోని వ్యక్తుల ప్రవర్తనలో హింసాత్మక వైఖరిని తెస్తుంది.

భయంకరమైన రాక్షసులు, క్రూర జంతువుల బొమ్మలను ఇంట్లో ఉంచకూడదు

భయంకరమైన రాక్షసులు, క్రూర జంతువుల బొమ్మలను ఇంట్లో ఉంచకూడదు


భయంకరమైన రాక్షసుల చిత్రాలు, పులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, సింహాలు, నక్కలు మరియు అడవి పందులు మొదలైన అడవి జంతువుల చెక్క లేదా లోహపు బొమ్మలను ఇంట్లో ఉంచకూడదు. విరిగిన విగ్రహాలు లేదా గాజులు కూడా ఇళ్లల్లో ఉంచకూడదు. పగిలిన గాజులు, అద్దాలు, పగిలిపోయిన దేవతా విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి వస్తువులు ఉంటె కచ్చితంగా ఆ ఇంట్లో అనేక ఇబ్బందులు ఉంటాయి, కనుక జాగ్రత్తగా ఇంట్లో ఉన్న వస్తువులను గమనించి వాస్తు లేని వస్తువులను దూరంగా పడెయ్యండి. ఇంట్లోకి సానుకూల వైబ్స్ ను ఆహ్వానించండి.

English summary
Architectural flaws can create problems at home and unhappiness in the family. Household items also have an impact on our lives. So make sure the house is free of unwanted objects which are unfriendly to Vastu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X