మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడికి నవగ్రహాలలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి శుభఫలితాలు రాగా, అశుభ స్థానంలో ఉంటే అశుభఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మార్చి 26వ తేదీన గురువారం నాడు శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలుగజేస్తుంది. శుక్రసంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష రాశి
కుజుడు అధిపతిగా ఉండే మేష రాశి వారికి శుక్రుడు లగ్న స్థానం లో ప్రవేశం చేయడం శుభకరంగా చెబుతారు. మేష రాశి వారి ప్రేమ జీవితం ఆనందమయంగా ఉంటుంది. భాగస్వామికి శుభవార్తలు వింటారు. మేషరాశి వారి నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.

మిధున రాశి
మిధున రాశి నుంచి 11వ స్థానంలో శుక్ర సంచారం శుభాలను కలుగజేస్తుంది. మిధున రాశి జాతకులకు దీనితో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు పనిచేసే చోట సానుకూల పరిస్థితులు ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. మిధున రాశి వారికి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి.
సింహరాశి
సింహరాశి నుండి 9వ స్థానం గుండా శుక్ర సంచారం సింహరాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. సింహ రాశి వారి చేపట్టే పనుల నుండి లో గొప్ప విజయాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కలిసి వస్తుంది.
తులారాశి
తులారాశి నుంచి సప్తమ స్థానంలో శుక్ర సంచారం చేయడం వల్ల తులారాశిలోని వ్యాపారులకు విశేషమైన ఫలితాలు వస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ప్రశాంతత ఉంటాయి.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి నుండి పంచమ స్థానంలో శుక్రుడి రవాణా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యర్థుల పైన విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కోర్టు కేసులలో విజయాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!













Click it and Unblock the Notifications