• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందు సనాతన ధర్మం ప్రకారం ఏం చేయకూడదు..ఏం చేయాలి?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మన సనాతన హిందూ ధరమ ప్రకారం పాటించవలసిన కొన్ని పద్దతులు. అవేంటో చూద్దాం..

* గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.

* ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.

* జీవిత భాగస్వామికి చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.

Know what needs to be followed according to the hindu dharma and traditions

* ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలాన్నిస్తాయి .

* అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చరించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.

* పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.

* పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.

* చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. పళ్ళు తోముకోకూడదు.

* పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అరటిఆకులో భోజనం చేయడానికి / పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి, మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు.

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. బాదాం ఆకులో భోజనం చేయడంవలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

* అన్నీ వడ్డించిన విస్తరి / పళ్లెం ముందు కూర్చోరాదు, మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.

* తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, దీర్గాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.

* ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది.

* అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట, దుర్భాష లాడుట చేయరాదు.

* ఏడుస్తూ తింటూ గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు, ఎవరిని దెప్పి పొడువరాదు.

* ఎట్టి పరిస్థితిలోనైనా ఒడిలో కంచం పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము.

* భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.

* భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడారాదు.

నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి.. ఆనందమే విజయానికి సోపానం.

English summary
Know what needs to be followed according to the hindu dharma and traditions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X