• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Interesting: పట్టిన శని వీడాలంటే శనిదేవుడికి ఎలాంటి పూజలు చేయాలి?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనైశ్చరాయ నమ:

కోణస్త పింగళ బభ్రు:

కృష్ణో రౌద్రాంతకో యమ:

సౌరి శనైశ్చరో మంద:

పిప్పలాదేవ సంస్తుత:

నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

శని భగవానుడి అనుగ్రహం పొందడం ఎలా

శని భగవానుడి అనుగ్రహం పొందడం ఎలా

శనీశ్వరుడి జయంతిని ప్రతి సంవత్సరం వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శని భగవానుడి అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. గ్రహస్థితి కలిసి వస్తుంది. దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి.

అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒక రోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శని గ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.

చేయాల్సిన పూజలు

చేయాల్సిన పూజలు

శని జయంతి రోజు భక్తులందరూ గంగా జలం, నువ్వుల నూనే పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి నువ్వుల నూనెతో , నల్ల నువ్వులతో , నల్లని వస్త్రంతో పూజించి దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. శని గోచార శని ప్రభావం తీవ్రంగా ఉన్న వారు తమ వేలికి గుర్రపు నాడతో చేసిన ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.

శని జయంతి రోజున ఏం చేయాలి..?

శని జయంతి రోజున ఏం చేయాలి..?

అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని, పంచదార ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. పేదవారికి నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, నువ్వులు, నువ్వుల నూనే, ఆకలి తీర్చే భోజనం చేయడానికి ఏవేని ఆహార పదార్ధాలు లాంటివి కేవలం ఆభాగ్యులకు, నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ,ఆకలిగొని ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే దానం చేయాలి, అప్పుడే శని దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.

శని దేవుడి ప్రాముఖ్యత ఏంటి..?

శని దేవుడి ప్రాముఖ్యత ఏంటి..?

సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతే కాకుండా చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠించాలి

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠించాలి

శని శాంతి మంత్ర స్తుతి :- ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు కింద ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి. ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు పేదవారికి, ఏమి లేని నిర్భాగ్యులకు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే

English summary
The Vaishakha Amavasya Tithi is celebrated every year. On this day If you worship Lord Shani with devotional attention, the blessings of Lord Shani will be upon you and all the difficult times will vanish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more