నవంబర్ 23 నుండి రాహు సంచారంతో వీరికి అన్నీ శుభవార్తలే!
రాహువును నీడ గ్రహంగా చెడు చేసే గ్రహంగా చెబుతారు. అటువంటి రాహువు నవంబర్ 23వ తేదీన శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శని దేవునికి చెందిన శతభిష నక్షత్రంలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత రాహువు శతభిషా నక్షత్రం లోకి వెళుతూ కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తున్నాడు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి రాహువు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎనిమిది నెలలపాటు శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. మేష రాశి వారి ఆదాయం ఈ సమయంలో పెరుగుతుంది. ఈ సమయంలో చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహువు దశమ స్థానం నుండి సంచారం చేస్తాడు. ఈ సమయంలో రాహువు వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సొంత ఇల్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. పెళ్ళికాని వారికి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి రాహువు సప్తమ స్థానం నుంచి సంచారం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏర్పడే రాజయోగాల కారణంగా సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
కన్యారాశి
కన్యా రాశి వారికి రాహువు ఆరవ స్థానంలో సంచారం చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కన్యారాశి జాతకులకు ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు మెరుగైన లాభాలు పొందుతారు. నూతనంగా వివాహం జరిగిన వారికి సంతాన భాగ్యం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి రాహువు ఆదాయ స్థానంలో సంచారం చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలు వస్తాయి.. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఉద్యోగులకు పదోన్నతులు తో పాటు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విదేశీ ఆఫర్లు దక్కే సూచనలు కూడా ఉన్నాయి.
.
కుంభరాశి
కుంభ రాశి వారికి రాహు సంచారం గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో చేసే ప్రయత్నాలలో విజయ లభిస్తుంది. కుంభరాశి జాతకుల కోరికలు నెరవేరుతాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం బాగుంటుంది. సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications