అడగండి: అమ్మాయికి కుజ దోషం ఉందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

01.(5) కుమార్‌ జగ్గు పిల్ల ( విజయవాడ) తేజశ్రీ (విజయవాడ) మ్యారేజ్‌ మ్యాచింగ్‌


కుజదోషాలు మాత్రమే వివాహానికి చివరి అంశాలు కావు. అమ్మాయికి కుజదోషం ఉంది, మీది దోషం ఉండి పరిహారమైన జాతకం, గణ కూటమి వంటివి కమనిస్తే సాధారణ పొంతన ఉంది. అమ్మాయికి వివాభావానికి దోషాలు 2 ఉన్నాయి. 8వ అధిపతి కుజుడు వివాహభావాన్ని 7ని చూస్తున్నాడు.

02. రమేష్‌ కుమార్‌ పెరికల, అకివీడు, విసా ప్రాబ్లమ్‌

మీకు ఏసమస్యా లేదు మీకు విదేశాలకి వెళ్లడానికి అన్ని విధాలా అనుకూలతలున్నాయి.

03. రంజిత్‌ రెడ్డి తొగరు, కరీంనగర్‌, ప్రభుత్వ ఉద్యోగం

మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఏ ఆటంకాలూ లేవు. ప్రయత్నించండి తప్పక వస్తుంది.

04. రాజు కట్కూరి, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహం అయ్యే సూచనలున్నాయి కానీ వివాహాధిపతి 8లో ఉండటం కొంత సమస్యాయుత అంశం దీనివల్ల వివాహ జీవితంలో సమస్యలుంటాయి.

Ask your atrologer: He answers your questions

05. శ్రీనివాస్‌ కొల్లి, తాడేపల్లి గూడెం, ఉద్యోగం పోయింది

ఏలినాటి శని నడవటం. 6వ అధిపతి, చంద్రుడి దశ లో రాహువు అంతర్దశ నడుస్తుంది. ఇది ఇబ్బందికర కాలమే. కొంత ఓపిక పుణ్యబలం పెంచుకోవాలి. శని, రాహు, చంద్రులకి దానాలు, పరిహారాలు చేసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తు ఉండండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. రవీంద్ర రూపినేని, నెల్లూరు, ఆర్థిక సమస్యలు

మీకు ఏలినాటి శని గోచారంలో, దశలో రవిలో రాహువుఉన్నాడు అనారోగ్యం దుబారాఖర్చులు శారీరక శ్రమ,వంటివి రాబడి తగ్గటం వంటివి వీటివలన జరుగుతాయి. శని రాహువులకి దానాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. లక్ష్మి అష్టోత్తర నామాలు చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

07. గౌతం రడ్డి కొత్తపల్లి, మూలా నక్షత్రం

మీరు పుట్టిన సమయం తెదీ వంటి వివరాలివ్వకుండా ప్రశ్న అడిగితే జాబ్‌ వంటి ముఖ్యమైన వివరాలకి సమాధానం చెప్పడం కష్టం. పుట్టిన వివరాలు పంపండి.

08. తంగెల్ల పల్లి నరేష్‌ కుమార్‌, హుజూర్‌ నగర్‌, ఉద్యోగ సమస్య

ఏలినాటి శని చివరిదశలో ఉంది. గోచారంలో రాహు కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంది మరొక సంవత్సరం ఇబ్బంది ఉంటుంది. వీటికి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. క్రమంగా మెరుగవుతుంది.

09. రవి కుమ్మరి, మ్రేమ పెళ్లి అవుతుందా ?

మీకు ప్రేమ పెళ్లి అవడానికి జాతక రీత్య అవకాశం లేదు.

10. అమత గౌరి, తిరుపతి, కుజ దోషం , మాంగల్య దోషం ఉందా ?

కుజ దోషమూ లేదు, మాంగల్య దోషమూ రెండూలేవు. చెప్పుడు మాటలు వినకండి మీకు మంచి వైవాహిక జీవితం బాగుది.

11. దేవీ ప్రదీప్‌, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా ?

మీకు జాతకరీత్యా ఫారిన్‌ ఛాన్స్‌ లేదు.

12. శ్రీ వల్లి, హైదరాబాద్‌, వివాహానికి దోషాలున్నాయా?

మీకు 7వ అధిపతి రాహువుతో కలిసి 8లో ఉన్నాడు కుజ, రాహువులకి పరిహారాలు చేసుకోండి. సరిపోతుంది.

13. కెరియర్‌ మరియు భవిష్యత్తు ఉరించి అడిగినవారు

మదన్‌ మోహన్‌, కర్నాటక

శ్రీధర్‌, 21.9.1989

నరసింహారావు. హైదరాబాద్‌

గంగాభవాని, ధర్మపురి

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

పుట్టిన వివరాలు సరిగ్గా ఇవ్వనివారు

చందు, 1988 పుట్టిన సమయం ఇవ్వలేదు

గొపాల్‌, మీ పుట్టిన తేదీ 2016 గా ఇచ్చారు సరిచుసుకోండి

అంజన్న, మహబూబ్‌ నగర్‌, ప్రశ్న రాయలేదు

15. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు.

భాగ్యవతి, అనంతపురం, సంతానం

బసవరాజు, తిరుపతి, ఉద్యోగం

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదలుచుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా
అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్య గురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుందా? ప్రశ్నస్పష్టంగా రాయండి)

పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి