హేవలంబి నామ సంవత్సరం: మిథునరాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం - 5 వ్యయం - 5 రాజ్యపూజ్యం - 3 అవమానం - 6

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఇది మీకు ఆందోళనను కలిగిస్తుంది. వృత్తిలో కష్టించి పనిచేయవలసి వస్తుంది. ప్రమోషన్లు అనుకున్న సమయములో రావు. అనవసరపు విషయాలలో/స్థిరాస్టి కొనుగోలు విషయాలలో తల దూర్చరాదు. శత్రువులకు దూరముగా ఉండవలెను. అయిన వారితోను, స్నేహితులతోను మంచిగా మసలుకొనవలెను. బాధలో ఉన్న వారిని పరామర్శిస్తారు. ఆర్థికముగా కలసి రాని కాలము. అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు చేయరాదు. మీ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము పై శ్రద్ధ చూపగలరు. ఈ సమయాలలో నిరుత్సాహముగాను, నీరసముగాను ఉందురు. ఈ సమయములలో జంతువులకు, ప్రయాణములకు దూరముగా ఉండవలెను. లేనిచో ప్రమాదములకు గురి కావలసి వస్తుంది. సంఘములో అందరితోను ఉన్నతంగా ప్రవర్తించాలి. లేనిచో మీకు అందరి వలన ఎదురు తనము లభిస్తుంది. అందరి వలన మాటలు పడతారు, మనస్తాపము పొందుతారు.

The Raasi Phalas of Hevalambi midhuna

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ సమయము మీకు ఆనందమును, జయమును కలిగిస్తుంది. కార్యసిద్ధి లభించి, పనిలో మరింత నిమగ్నలు అవుతారు. చేయు వృత్తి వ్యవహారములలో మంచి ఫలితములు లభించి, గౌరవములు పొంది మరిన్ని మంచి అవకాశములు, లాభమును గడిస్తారు. విధ్యారులకు మంచి కాలము, మంచి శిక్షణ లభించి, అనుకున్నవి సాధిస్తారు. ఆర్థికముగా ఇంటా, బయటా బాగుగా ఉంటుంది. పశువులను, ఇంటిని, వస్తువులను, ఆభరణములను, వస్తాలను కొనుగోలు చేస్తారు. పెళ్లికాని వారికి, మంచి సంబంధము లభించి, వివాహ యోగ్యము కలదు. వివాహితులకు సంతాన ప్రాప్తి, మీ ప్రవర్తన ఇంట్లోని వారితో చక్కగా ఉండి, లాభము పొందువారు, ఇంట్లో సేవకులను పెడతారు. గృహమునందు శుభకార్యములు మీరు నిర్వహిస్తారు. సంఘములో మంచిపేరు, ఉన్నత వ్యక్తుల పరిచయము ద్వారా లబ్ది పొందుతారు, చలాకీగా వ్యవహరించి, అన్ని విషయాలలోను విజయము సాధిస్తారు. మంచి సమయమును గడుపుతారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మనశ్శాంతితో ఉంటారు.

శని 07ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశలో మీ జీవితము మందకొడిగా సాగుతుంది. ప్రతీ విషయములోను జాగ్రత్త పాటించాలి. ధన నష్టము, ఋణములు చేయరాదు. పని ఒత్తిడి పెరుగును. కష్టించి పని చేయాలి. భాగస్వామ్య వ్యాపారములో మిమ్మల్ని మోసము చేయుదురు. వృత్తి వ్యవహారములందు జాగ్రత్తగా పని చేయగలరు. విధ్యారులు చదువుపై నిగ్రహము పెటుట కష్టము. విదేశి ప్రయాణములు సంభవము. అయితే, కష్టాలు ఎదుర్కొందురు.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశ ఆర్థిక లాభమునకు దారితీయును. పాత బాకీలు తీర్చెదరు. ధనము అన్ని చోట్లయందు లభించును. మీరు స్థలమును గాని, ఇళ్లుగాని కొనగలరు. శత్రు జయము, ఆరోగ్యదాయకముగా ఉండవచ్చును. ఇంటా, బయటా బాగుండును. పై అధికారుల మనన్నలు పొందుదురు. స్నేహితులు మేలు చేయగలరు. వైవాహిక జీవితము మెరుగుపడును. సంతానము కలుగును. ఈ కాలములో బంధు వర్గము వారు మీతో సంతోషముగా ఉందురు.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. స్థాన చలనము సంభవించును. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము, అనేక కరములైన వ్యాధులు కలుగును. భార్య, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. గృహములో శాంతిగా ఉండాలి. జీవిత భాగస్వామి మరణము వలన మరో వివాహము సంభవించును. స్నేహితులతో మంచిగా మసలు కొనవలెను. లేనిచో స్నేహితులు దూరమగుదురు. ఈ దశలో మనశ్శాంతి కరువగును. అసహనము పెరుగును. అనవసర విషయాలలో తల దూర్చరాదు. ఎన్నికలలో నిలోనుటకు, కోరు విషయాలలోను మంచిది.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, కేతువు నవమమునందు ప్రవేశము:-
ఈ దశలో ఆరోగ్యభంగము, మనశ్శాంతి లేకుండుట జరుగును. సంపాదించిన ధనమును లాటరీలకు ఖర్చు చేయుట వలన ధన నష్టము కలుగును. ధన నష్టము చేసి కష్టాలకు గురి కాగలరు. జాతి విరుద్ధమైన పనులు చేయుదురు. సోదర వర్గముతో విరోధములు పనికి రావు. స్నేహితులతోను, అయిన వారితోను మంచిగా ప్రవర్తించవలెను. లేనిచో వారు మీకు దూరము కాగలరు. ఈ సమయములో మీరు విదేశీ ప్రయాణములు లేదా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లారు. మీరు వృత్తి వ్యవహారములలో శత్రువులచే మరియు విరోధులచే నష్టాన్ని చవి చూస్తారు.

రాహువు తృతీయమునందు ప్రవేశము:- ఈ దశ చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చును. ఆర్ధికముగా మంచికాలము. ధనాదాయములు, అనేక రకములుగా చేతికి వచ్చును. ఆఖరికి శత్రువుల నుంచి కూడా ధనమును ఆశించగలరు. ఉద్యోగములో ఉన్నట్టయిన, జీతము పెరుగును, పేర్ల మార్కెట్లలో ఉన్న వారికి మంచి ఆదాయము సంభవించవచ్చును.
ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశలో ఆర్థికముగా, శారీరకముగా, సంఘపరముగా ఇబ్బందులు కలుగవచ్చును. మితముగా ఖర్చు చేయుట మంచిది. అనుకోని ఖర్చులు, దొంగతనము జరగవచ్చును. శరీరముపై జాగ్రత్త అవసరము, అకాల భోజనము, బయట భోజనము చేయుట పనికి రాదు. నేత్రములకు హాని, భాగస్వామి ఆరోగ్య భంగము కలుగవచ్చును. కోరు కేసులు కలసి రావు. బంధు వర్గము వారితో విరోధములు, వాదోపవాదములు పనికి రావు. కేతువు అష్టమమునందు ప్రవేశము:- ఈ దశ ప్రభావముచే మీరు అనారోగ్యముతో బాధ పడుదురు. కావున, ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ వహించి జాగ్రత్తగా మెలగాలి. ఈ దశలో చాలా రోగములు రావడానికి అవకాశములున్నవి. జ్వరము, ఒంటి నొప్పులు, శరీరములో వివిధ భాగాలకు తీవ్రమైన నొప్పి కలుగవచ్చును. మనశ్శాంతి పూర్తిగా కోల్పోతారు.

కర్కాట రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...