రోజాకు తప్పిన ప్రమాదం
రాజమండ్రి: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం నుంచి ఆమె తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరిగా రాత్రి 9.20గంటల సమయంలో కోటనందూరులో కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖనుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రత్యేక రైలు అందుకునేందుకు అత్యంత వేగంతో తుని చేరిన ఆమె 2వ నెంబరు ఫ్లాట్‌ఫారం వద్దకు చేరుకున్నారు.
అప్పటికే రైలు స్టేషన్ సమీపంలోకి వచ్చేస్తోంది. ఇది చూసిన రోజా తదితరులు క్షణాల వ్యవధిలో ట్రాక్దాటి 1వ నెంబర్ ఫ్లాట్‌ఫారంపైకి చేరుకున్నారు. రోజా ట్రాక్దాటిన క్షణాల్లోనే అదే ట్రాక్‌పై నుంచి రైలు వచ్చింది. ట్రాక్దాటేటప్పుడు రోజాకు రైలుకు మధ్య కొన్ని అడుగుల దూరం మాత్రమే ఖాళీవుంది. అక్కడివారందరికీ ఒక్కటే టెన్షన్..త్రుటిలో ప్రమాదం తప్పిందని ఉపిరిపీల్చుకున్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications