రాష్ట్రంలో ప్రబలుతున్న అతిసారా
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు గ్రామాల్లో అతిసారా వ్యాధి ప్రబలుతోంది. డయేరియాతో రోగులు ఆస్పత్రుల పాలవుతున్న సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామంలో 30 మంది ఆస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో కూడా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధికి 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పాలవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అతిసారా వ్యాధి ప్రబలినట్లు వార్తలు వస్తున్నాయి.
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అతిసారంతో ప్రజలు ఆస్వస్థత పాలయ్యారు. సత్తెనపల్లి గ్రామంలో అతిసారం సోకి 50 మందికిపైగా అస్వస్థతపాలవటంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స జరుగుతోంది.
Comments
hyderabad హైదరాబాద్ guntur dist peddapalli hospital kharim nagar diarrhea డయేరియా వరంగల్ జిల్లా భూపాలపల్లి
Story first published: Saturday, May 30, 2009, 12:45 [IST]