వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమైక్యవాదానికి చిరంజీవి జై

పార్టీ వైఖరిని మార్చుకునే విషయంపై చిరంజీవి పార్టీ నాయకులతో మంగళవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర నినాదంతోనే పోరాటంలో పాల్గొనాలని కూడా చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి నిర్ణయాన్ని తెలంగాణ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రజాభీష్టం మేరకే కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు రాజీనామాలు చేశారని, వారి రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని అడిగే హక్కు తనకు లేదని చిరంజీవి మంగళవారం అన్నారు.