తెలంగాణపై యుపిఎలో మిత్రభేదం

Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)లో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కాంగ్రెసు ఏకపక్షంగా ప్రకటించడాన్ని యుపిఎలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు తప్పు పట్టాయి. డిఎంకె, తృణమూల్ కాంగ్రెసు, శరద్ పవార్ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కాంగ్రెసు అనుసరించిన వైఖరితో విభేదించాయి. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సిగ్ నేతృత్వంలో మంగళవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ విభేదాలు బయట పడ్డాయి. భాషా ప్రాతిపదికపై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా ఎలా విభజిస్తారని డిఎంకె అడిగినట్లు తెలుస్తోంది.

తెలగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తృణమూల్ కాంగ్రెసు, ఎన్సీపి కూడా అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చిన్నరాష్ట్రాల డిమాండ్లు ఊపందకుంటాయని, తెలంగాణ ప్రకటన చేయగానే గూర్ఖాలాండ్ కోసం దీక్షలు ప్రారంభమయ్యాయని తృణమూల్ కాంగ్రెసు నాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా భవిష్యత్తులో ప్రత్యేక విదర్భ సమస్య తలెత్తుతుందని ఎన్సీపి నేత శరద్ పవార్ అన్నట్లు సమాచారం. మిత్రులతో విభేదాలు పొడసూపడంతో ప్రధాని కార్యాలయం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుండా శాంతి సామరస్యాలను కాపాడాలంటూ ప్రకటన చేసింది. రాష్ట్రంలో శాంతిసామరస్యాలను కాపాడడానికి ప్రజలు, పార్టీలు ప్రయత్నం చేయాలని ప్రధాని కార్యాలయం కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+