హైదరాబాద్: తెలంగాణలోని విద్యాసంస్థలను వెంటనే తెరవాలని రాష్ట్ర హైకోర్టు బుధవారం ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన కూడా చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 19వ తేదీన విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వెంటనే వాటిని తెరవడం అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం, విద్యార్థులు దానికి మద్దతు తెలియజేయడం వంటి పరిణామాలతో ప్రభుత్వం తెలంగాణలోని విద్యాసంస్థలను మూసేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి తెలంగాణలోని విద్యాసంస్థలు తెరవలేదు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి