వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోహన్ బాబుపై కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohan Babu
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లాలోని ఎల్పీ నగర్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. మోహన్ బాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిర్యాదుపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరం ముస్లింలదని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యాయవాదుల ఫిర్యాదుపై మూడు రోజుల పాటు సంప్రదించిన పోలీసులు శుక్రవారం మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. అంతకు ముందు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారంటూ నిరసన తెలపడానికి న్యాయవాదులు పెద్ద యెత్తున పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికను తమకు ఇవ్వాలని వారు పోలీసులను కోరారు. తాను రాయలసీమవాడినని, చూసుకుందామంటూ రెచ్చగొట్టే విధంగా మోహన్ బాబు మాట్లాడారని న్యాయవాదులు ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X