Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణకు బాబును ఒప్పిస్తాం: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణకు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వైఖరిని ప్రకటించిన మరు క్షణమే తమ నేత చంద్రబాబు ప్రకటిస్తారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా తాము కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, తమ వైఖరి తెలంగాణపై మార్చుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లకు రహస్య ఎజెండా ఉందని, అందుకే తాము జెఎసిలో చేరడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ నేతలంతా చంద్రబాబును వదిలేసి తెలుగుదేశం నుంచి బయటకు రావాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అనడాన్ని బట్టే రహస్య ఎజెండా అర్థమవుతోందని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటే మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు సోనియాకు కాకుండా ముఖ్యమంత్రికి, స్పీకర్ కు రాజీనామాలు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము 39 మంది శాసనసభ్యులం స్పీకర్ కు రాజీనామాలు సమర్పిస్తే కూడా ఆహ్వానించని కెసిఆర్ కాంగ్రెసు వారు సోనియాకు రాజీనామాలు సమర్పిస్తే అభినందించారని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+