వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై సిపిఐ ఎమ్మెల్యేల రాజీనామా

తాజా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు శుక్రవారం మఖ్దూం భవన్ అందుబాటులో ఉన్న పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుల సమావేశం జరిగింది. తెలంగాణ అంశంపై శాసనసభ్యుల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతకు ముందే నలుగురు శాననసభ్యులు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేందుకు పార్టీ అనుమతి కోరినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సిపిఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.