వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మైక్రో ఫైనాన్స్ సంస్థల కట్టడికి ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

సూక్ష్మరుణ సంస్థలు తమ పేర్లను ప్రభుత్వం దగ్గర నేటి నుండి 30 రోజుల్లోగా అనుమతుల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. సంవత్సరం పాటు ఆయా సంస్థలకు అనుమతి ఉంటుంది. అ తరువాత వారి వారి పనితీరుని బట్టి పొడిగిస్తాం. సంస్థలు వారు ఇచ్చే వడ్డీని సూచిక బోర్టులపై నిత్యం సూచించాలి. చట్టంలో ఉన్న నిబంధనలు పాటించకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించని రుణ సంస్థలను రద్దు చేయటంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. సూక్ష్మరుణ సంస్థల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే 155321 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చు.